February 1, 2025

ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో వైభవంగా శ్రావణాల పౌర్ణమి వేడుకలు

చెన్నై న్యూస్: చెన్నైకి చెందిన ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన శ్రావణాల పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు .ఈ సందర్భంగా గోపూజలు, బాలురకు గిఫ్ట్ హ్యాపర్లు, భక్తిగీతాలాపణలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ముందుగా 6 ఏళ్ళు నుంచి 9 ఏళ్ల వయస్సుగల తొమ్మిది మంది బాలురకు ఆర్యవైశ్య అన్నదాన సభ తరఫున లాంచ్ బ్యాగ్ , టవల్, చాక్లెట్ లు, బిస్కెట్లు తో కూడిన గిఫ్ట్ హాంపర్లు పంపిణీ చేశారు .అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం గోశాలలో ముత్తైదువులంతా కలసి
గోవులకు పసుపు ,కుంకుమ అద్ది పూలతో , వస్త్రాలతో అలంకరించి గోపూజను అత్యంత వైభవంగా నిర్వహించారు .గోమాత పాటలను ఆలపించి భక్తిభవాన్ని చాటారు.చిన్నారులు భక్తి శ్లోకాలు ఎంతో చక్కగా వినిపించి ఆకట్టుకున్నారు.ఆగష్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగరంలోని పేదలకు ఐస్ క్రీమ్ లను వితరణ చేశారు.

.ఈ సందర్భంగా ఆర్యవైశ్య అన్నదాన సభ వ్యవస్థాపక అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బాలికలకు అనేక పండుగలలో కానుకలు ఇవ్వడం జరుగుతుంది.ముఖ్యంగా నవరాత్రి సందర్భంలో బాలికలను నవకన్యలుగా పూజిస్తూ కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. శ్రావణాల పౌర్ణమి బాలురకు ప్రత్యేకమైన పండుగ అని ఈ సందర్భంలో తమ సభ తరుపున తొలిసారిగా బాలురకు కానుకలు ఇవ్వాలని తలచి గిఫ్ట్ హాంపర్లు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రానున్న సంవత్సరాలలో మరింత మంది బాలురకు కానుకలు ఇవ్వాలని ఆసక్తితో ఉన్నట్టు తెలిపారు.
చిన్నారులకు , పెద్దలకు అందరికీ గోమాత ఆశీస్సులు మెండుగా ఉండాలని భాగ్యలక్ష్మి ఆకాంక్షించారు. తమ సభ తరపున ప్రతినెల అమావాస్య రోజున బ్రాడ్ వే లోని వరదాముత్తియప్పన్ వీధిలోని గీతామందిరంలో సునాధ వినోదిని బృందం చేత ఆధ్యాత్మిక భక్తి గీతాలు ఆలపిస్తుండగా, ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని గోశాలలో గో పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు . మరిన్ని వివరాలకు ఆర్యవైశ్య అన్నదాన సభ నిర్వాహకులు భాగ్యలక్ష్మి ఫోన్ నెంబర్ 99529 83595 సంప్రదించగలరు. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా దాతలు సాయం అందించవచ్చునని నిర్వహకులు కోరారు

About Author