December 25, 2024

ఎస్ కె పి డి అండ్ చారిటీస్ నిర్వహణలోని మహర్షి విద్యామందిర్ లో సంక్రాంతి సంబరాలు

చెన్నై న్యూస్: చెన్నైలోని పెరియమేట్ లో ఎస్ కె పి డి అండ్ చారిటీస్ యాజమాన్యంలో కొనసాగుతున్న
మహర్షి విద్యామందిర్ సీనియర్ సెకండరీ స్కూల్లో 2024 సంవత్సర సంక్రాంతి పండుగ సంబరాలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలను ఎస్ కె పి డి అండ్ చారిటీస్ ట్రస్టీలు దేసు లక్ష్మీనారాయణ, సుదర్శనం, రామ్ కుమార్ లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. అనంతరం సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు మన పండుగల గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలని , ఉపాధ్యాయులు సైతం తెలియజేయాలి అని సూచించారు. సంక్రాంతి శోభను తెచ్చేలా ఎంతో చక్కగా అలంకరించారని,అలాగే విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయని విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. ఈ వేడుకల్లో విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై సందడి చేశారు. పొంగళ్లు పొంగించటం , బోగిమంటలు వేయడం తోపాటు వివిధ రకాల తమిళ, తెలుగు జానపద నృత్యాలతో, కోలాటాలతో చిన్నారులు కనువిందు చేశారు.అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు లను ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సంక్రాంతి పండుగ ఏర్పాట్లును పాఠశాల మేనేజర్ శ్రీలత, సీనియర్ ప్రిన్సిపల్ వినోలా , ప్రిన్సిపల్ సుబ్రమణ్యం పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంక్రాంతి సంబరాల్లో ఆనందంగా గడిపారు.

About Author