January 11, 2025

కంటే కూతుర్నే కనాలి – అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో తంగుటూరి రామకృష్ణ

చెన్నై న్యూస్ కంటే కూతుర్నే కనాలి అని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ పేర్కొన్నారు.వామ్ గ్రేటర్ చెన్నై మహిళా విభాగ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను మార్చి 7వ తేదీ గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. వామ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలత అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయరాజ్ ఇంటర్నేషనల్ ప్రయివేటు లిమిటెడ్ నిర్వాహకురాలు టి. జయశ్రీ రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తమ సంస్థ తరఫున పేద మహిళలకు కుట్టు మిషన్ ను వితరణ చేశారు. జయశ్రీ మాట్లాడుతూ
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అన్ని రంగంలో కూడా పురుషుల కంటే ఎక్కువమంది మహిళలు ఉన్నత స్థాయిలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నట్టు తెలిపారు. స్త్రీ పురుష భేదం లేకుండా మహిళలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో వామ్ మహిళలను ప్రోత్సహిస్తుందన్నారు.ఈ సందర్భంగా రామకృష్ణ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వామ్ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారని అన్నారు. చాలా కుటుంబాలలో కొడుకులు కన్నా కుమార్తెలే తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు కంటే కూతుర్నే కనాలి అని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు మహిళలు ఎంతో ధైర్యంతో వారి వారి రంగాల్లో అడుగులు అడుగులు వేస్తే ఆదర్శమైన మహిళలుగా నిలుస్తారన్నారు పూర్వకాలంలో సనాతన ధర్మాలు, ఆచారాలు, కట్టుబాట్లు ,చిన్న చూపు వల్ల దశాబ్దాలుగా మహిళలు తెరచాటునే ఉండిపోయారన్నారు అలాంటి రోజుల నుంచి ప్రస్తుతం మహిళలు చైతన్యవంతులై స్ఫూర్తిగా నిలుస్తున్నారు .త్వరలో దుబాయ్ అబుదాబిలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ జరుగునుందని ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు తెలియజేశారు ఈ సదస్సును విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానించారు. ముందుగా మహిళలు ఆటపాటలతో అందరినీ అల్లరించారు ఈ కార్యక్రమంలో వామ్ గ్రేటర్ చెన్నై అధ్యక్షులు బెల్లంకొండ సాంబశివరావు, వామ్ తమిళనాడు రాష్ట్ర సీనియర్ సిటిజన్ అధ్యక్షులు విఎన్ హరినాథ్ , పేర్ల బద్రీ నారాయణ ఉమా ఉమా జగదీష్ రాణి హరినాథ్ కోటేశ్వరరావు మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.వేడుకలో భాగంగా ఆక్యూపంక్చర్ చికిత్సను డాక్టర్ వనిత , శశికళ లు ఉచితంగా చేశారు.

About Author