November 10, 2024

క్రీడలతో ఉజ్వల భవిష్యత్ -అసిస్టెంట్ ప్రొఫెసర్ మునినాథన్ .కె

చెన్నై న్యూస్ :
ఎస్ కే పి డి అండ్ చారిటీస్ నిర్వహణలో కొనసాగుతున్న ఎస్ కే పి డి బాలుర, కే టి సి టి బాలికల ప్రాథమిక , మహోన్నత పాఠశాలల వార్షిక స్పోర్ట్స్ మీట్ -2024 ఘనంగా జరిగింది .
స్థానిక ప్యారీస్ లోని ఎస్ కె పి సి మైదానంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎస్ కె పి డి పూర్వ విద్యార్థి, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మునినాథన్ పాల్గొని స్పోర్ట్స్ మీట్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు .ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ కనువిందు చేసింది .కార్యక్రమంలో ముందుగా ఎస్ కె పి డి, కెటిసిటి పాఠశాలల కరస్పాండెంట్ ఎస్ ఎల్ సుదర్శనం స్వాగత ఉపన్యాసం చేయగా, ముఖ్య అతిథిని ఎస్ కె పి డి బాలుర మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఓ. లీలారాణి సభకు పరిచయం చేశారు .ఈ సందర్భంగా ఎస్ కే పి డి ట్రస్టీలు ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి అతిధిగా పాల్గొన్న కె మునినాధన్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు అన్ని రకాల క్రీడల్లోనూ ఉత్సాహంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడలు సైతం ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని ఆయన పలు రకాల ఉదాహరణలతో విద్యార్థుల్లో స్ఫూర్తినింపారు. అలాగే ట్రస్టీలు ఊటుకూరు శరత్ కుమార్ ,టీవీ రామ కుమార్ ,సి ఆర్ కిషోర్ బాబు తదితరులు విద్యార్థులకు అభినందనలు తెలిపి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. చివరిగా
వందన సమర్పణను కేటీసిటీ బాలికల మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. అనిల చేయగా, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ. రమేష్ , సి. రేవతి తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ నివేదికలను ఆయా పాఠశాలల క్రీడా సెక్రటరీలు పి. గౌరీ శంకర్, వి. దేవి లు సమర్పించారు. క్రీడల్లో ప్రతిభను చాటుకున్న విద్యార్థిని విద్యార్థులను మెడల్స్, సర్టిఫికెట్లతో సత్కరించారు. వివిధ రకాల పోటీల్లో విజేతలకు నిలిచిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు బహుమతులు అందించారు. సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా విద్యార్థిని విద్యార్థుల జానపద నృత్యాలు, అబ్బుర పరిచే పిరమిడ్ విన్యాసాలు అందర్నీ అమితంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమనికి వ్యాఖ్యలుగా తెలుగు అధ్యాపకురాలు వసుంధర, ఆంగ్ల అధ్యాపకులు సురేష్ లు వ్యవహరించారు

About Author