December 23, 2024

ఘనంగా  స్నేహం-2023 సెలెబ్రేషన్స్

చెన్నై:  కేటిసీటీ పూర్వ విద్యార్థినిల సంఘం ఆధ్వర్యంలో స్నేహం-2023 సెలెబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకున్నారు. చెన్నై పుదుపేటలోని చంద్రభాను వీధిలో ఉన్న నాథముణిహాలులో ఆదివారం ఉదయం జరిగిన ఈ వేడుకలకు సంఘం అధ్యక్షురాలు జి. సరళ అధ్యక్షత వహించారు. సరళ  మాట్లాడుతూ ప్రతీ ఏడాది స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పేలా సంఘం తరపున వేడుకలను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ స్నేహం  వేడుకల్లో కార్యవర్గ సభ్యులంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు .తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి  , విద్యార్థులు విద్యా వికాసానికి కెటిసిటీ  పూర్వవిద్యార్థినిల సంఘం ఎంతో కృషి చేస్తుందని గుర్తు చేశారు. స్నేహం-2023 వేడుకల్లో సంఘ సభ్యులకు   స్పాట్ గేమ్స్, హౌసీ హౌసీ, ఛేంజ్ ఫర్ ఛేంజ్, లక్కీ డ్రా తదితర పోటీలు నిర్వహించారు. ఇంకా ఫోటో బూత్, వివిధ రకాల స్టాల్స్  ఏర్పాటు చేశారు. ఎంతో ఉత్సాహంగా మహిళలు పోటీల్లో పాల్గొని తమదైన ప్రతిభను చాటుకున్నారు. విజేతలుగా నిలిచిన మహిళలకు సంఘం అధ్యక్షురాలు జి. సరళ, సెక్రటరీ ఈ. షర్మిళ , కోశాధికారి బి. లక్ష్మీ దేవి కలసి బహుమతులను బహుకరించారు. ఈ వేడుకల్లో కేటిసిటీ పూర్వ విద్యార్థినిల సంఘం సభ్యులంతా పాల్గొని స్నేహం వేడుకలను విజయవంతం చేశారు.

About Author