November 23, 2024

టామ్స్ సౌత్ చెన్నై జిల్లా విభాగం ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

చెన్నై న్యూస్:తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్) సౌత్ చెన్నై జిల్లా విభాగం ఆధ్వర్యంలో చెన్నై పల్లికరణై లోని మయిలై బాలాజీ నగర్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు .ఉదయం 9 గంటలకు ఏర్పాటు అయిన ఈ వేడుకలకు టామ్స్ సౌత్ చెన్నై జిల్లా అధ్యక్షులు రొడ్డా జయరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయిల్ ,టామ్స్ రాష్ట్ర అధ్యక్షులు నేలటూరి విజయ్ కుమార్ లు కూడా జెండా పండుగలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా రొడ్డా జయరాజ్ చేతులమీదుగా చిన్నారులకు పెన్నులు, పెన్సిళ్లు , నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గణతంత్ర వేడుకలను ఎంతో సంబరంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు .దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను నిత్యం స్మరించుకోవాలని చిన్నారులకు హితవుపలికారు. ఆది ఆంధ్రుల అభ్యున్నతకి ఎన్నో దశాబ్దాలుగా ఎనలేని సేవలు
అందిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేలు మాట్లాడుతూ ప్రస్తుతం ఆదిఆంధ్ర కుటుంబాలకు చెందిన విద్యార్థులు,యువత విద్యతోపాటు వివిధ ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని అన్నారు. 3 శాతం రిజర్వేషన్ ను టామ్స్ సాధించి పెట్టడం వల్ల అనేకమంది ఆదిఆంధ్ర అరుంధతీయ విద్యార్థులు గొప్ప గొప్ప చదువులు చదివేందుకు ఆస్కారం లభించిందని ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. టామ్స్ రాష్ట్ర అధ్యక్షులు నేలటూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ గణతంత్ర వేడుకలను చాలా చక్కగా నిర్వహించిన టామ్స్ సౌత్ చెన్నై జిల్లా అధ్యక్షులు రొడ్డా జయరాజ్ తో పాటు బాలాజీ నగర్ టామ్స్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టామ్స్ మయిలై బాలాజీ నగర్ బ్రాంచ్ గౌరవ అధ్యక్షులు ఎస్ మస్తాన్, అధ్యక్షులు బి. పెంచలయ్య , సెక్రటరీ సిహెచ్ తిరుపాల్ ,కోశాధికారి ఆర్ సుబ్రమణి, ఉపాధ్యక్షులు టి.సుబ్బయ్య, జాయింట్ సెక్రెటరీ ఈ. దేవదాస్, ఉప కోశాధికారి ఎన్ .విజయ్ కుమార్, సలహాదారులు కే. వెంకటరమణయ్య ,వై .ఆరోగ్య దాస్, సంఘ కమిటీ సభ్యులు జి.దానియేలు ,వి.నెహేమియా ,జి. హజరతయ్య, వి.వెంకట రావు తదితరులు పాల్గొన్నారు

About Author