December 17, 2024

ప్రపంచ తెలుగు సమాఖ్య సేవలు ప్రసంశనీయం- భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు

https://youtu.be/A19pyXaZsYw?si=ZDWcpDkwYmY-vw21

చెన్నై న్యూస్ : అంకిత భావంతో తెలుగు భాష, సాహిత్యానికి ,ప్రాచీన కళలు, కళాకారులకు ప్రపంచ తెలుగు సమాఖ్య చేస్తున్న సేవలు ప్రసంశనీయమని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కొనియాడారు.
ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూ టి ఎఫ్)30వ వార్షికోత్సవ వేడుకలు నవంబర్ 26వ తేదీ ఆదివారం సాయంత్రం చెన్నైలోని మ్యూజిక్ అకాడమి వేదికగా జరిగింది.డబ్ల్యూ టీ ఎఫ్ అధ్యక్షురాలు డాక్టర్ వి.ఎల్.ఇందిరాదత్ సభకు అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ముందుగా హైదరాబాద్ కు చెందిన నృత్యదర్పణ నేతృత్వంలో అర్ధనారీశ్వరం పేరిట కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహూతులను కనువిందు చేసింది . ఈ సందర్భంగా స్వాగతోపన్యాసం ను డాక్టర్ వి.ఎల్.ఇందిరాదత్ చేస్తూ 1993 లో ఏర్పడిన డబ్ల్యూ టి ఎఫ్ సంస్థ తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తుందన్నారు.

జాతీయ, అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహిస్తూ బాషా ,సంస్కృతి ,సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు భాష గొప్పతనాన్ని యువతకు తెలుపుతున్నట్టు చెప్పారు..తెలుగు రానివారికీ తెలుగుభాషను ఉచితంగా నేర్పిస్తూ సేవ చేస్తున్నామన్నారు. రానున్న 2024 సంవత్సరం సంక్రాంతి నుంచి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేలా నీతికథలు నేర్పించనున్నామని తెలిపారు. అనంతరం వార్షిక నివేదికను డబ్ల్యూ టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ.వి.శివ రామప్రసాద్ చదివి వినిపించారు

ముఖ్య అతిథిగా పాల్గొన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా యార్లగడ్డ ప్రభావతి శంబు ప్రసాద్ స్మారక పురస్కారాన్ని బాలసాహితీ వేత్త చొక్కాపు వెంకటరమణకు, గొట్టుముక్కల అప్పారావు స్మారక పురస్కారాన్ని జానపద కళాకారులు ,రంగం (ప్రజా సాంస్కృతిక వేదిక)- విజయవాడ వ్యవస్థాపక కార్యదర్శి రంగం రాజేష్ కు ప్రదానం చేశారు.వీరిద్దరికి నగదు పురస్కారం, శాలువా, జ్ఞాపిక , సన్మాన పత్రాలతో సత్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భాషను కాపాడుకోపోతే మన ఉనికినే కోల్పోతామన్నారు.తెలుగు అజంత భాష అని దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంకిత భావంతో తెలుగు భాషకు డబ్ల్యూ టి ఎఫ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని నిర్వాహకులను అభినందించారు.ఆత్మీయ అతిథిగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.వందన సమర్పణను కార్యదర్శి శ్రీలక్ష్మి మోహన రావు చేశారు. కార్యక్రమంలో చివరగా దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమి- హైదరాబాద్ వారిచే తెలుగు వైభవం (సాంఘిక రూపకం) , అలాగే రంగం (ప్రజా సాంస్కృతిక వేదిక)- విజయవాడ వ్యవస్థాపక కార్యదర్శి రంగం రాజేష్ నేతృత్వంలో కళాకారులు జానపదం (ఆట-పాట) కార్యక్రమాలతో అలరించారువ్యాఖ్యాతగా హైదరాబాద్ కు చెందిన పి.వి.సాయి వ్యవహరించారు.డబ్ల్యూ టీ ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ కవితా దత్ కోశాధికారి వెంకట సుబ్బారావు , పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గోటేటి వెంకటేశ్వర రావు, సభ్యులు జె ఎం నాయుడు, అదిశేషయ్య , కె ఎన్ సురేష్ బాబు , మహిళా సభ్యులు , నెల్లూరు తదితర జిల్లాల నుంచి డబ్ల్యూ టీ ఎఫ్ ప్రతినిధులు, తెలుగు సాహితీ ప్రియులు పాల్గొన్నారు..

About Author