January 23, 2025

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ… రన్ ఫర్ జీసస్-వేలాదిమంది తో సాగిన నడక ,రన్

ఫోటో: : రన్ ఫర్ జీసస్ను ప్రారంభిస్తున్న సెల్వరాజ్, బిషప్ ఎడిషన్, రెవరెండ్ ప్రకాష్ రాజ్ తదితరులు.

Chennai news : ప్రపంచ శాంతి, క్రైస్తవుల ఐక్యత, దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులు, పోలీసులకు మంచి ఆయురారోగ్యాలు నెలకొనాలని కాంక్షిస్తూ చెన్నైలో శనివారం ఉదయం చేపట్టిన 4వ వార్షిక రన్ ఫర్ జీసస్ (run for jesus)కు అనూహ్య స్పందన లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆరాధన టీవి చానల్ పిలుపుతో ప్రతీ ఏటా ఈస్టర్ ఆదివారం ముందురోజు శనివారం ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం చేపడుతూ వస్తున్నారు. అందులో భాగంగా చెన్నై ఎగ్మూర్ లోని రాజారత్నం స్టేడియం నుంచి ఆరంభం అయిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీజీపీ గ్రూప్ ప్రెసిడెంట్ కార్డినల్ విజి సెల్వరాజ్ జెండా ఊపి ప్రారంభించారు . రన్ ఫర్ జీసస్ అధ్యక్షులు బిషప్ కెబి ఎడిషన్, ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ ఎస్ ప్రకాష్ రాజ్ అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమంలో చెన్నైతోపాటు అవడి అంబత్తూరు, ఆయనావరం, పుల్లాపురం, కొరుక్కుపేట, కీల్పాక్కం, తదితర ప్రాంతాల నుంచి బిషప్ లు , రెవరెండ్లు, పాస్టర్లు, వివిద క్రైస్తవ సంఘాల నాయకులు, విశ్వాసులు, యువత, చిన్నారులు, రన్ ఫర్ జీసస్ కమిటీ సభ్యులు దాదాపు 3 వేలమంది క్రైస్తవులు నడచుకుంటూ, మోటర్ సైకిళ్లు నడుపుతూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.యేసు క్రీస్తు శాంతి మార్గానికి సూచించిన సూక్తులతో కూడిన ఫ్లకార్డులు చేతబూని రన్ ఫర్ జీసస్ జెండాలతో క్రీస్తు పునరుత్థానాన్ని ప్రకటిస్తూ, క్రైస్తవ గీతాలను ఆలపిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎస్ ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక క్రీస్తు అని అన్నారు . శిలువు వేయడం వల్ల మరణించిన ఏసు క్రీస్తు మూడవ రోజున పునరుత్తానాన్ని ఈస్టర్గా జరుకోవటం జరుగుతుందని అన్నారు. ఈస్టర్కు ఆహ్వానం పలుకుతూ రన్ ఫర్ జీసస్ ను నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. ప్రపంచంలో శాంతి కోసం చేపట్టిన ఈ రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇందులో రెవరెండ్ జే ఇజ్రాయేల్, రెవరెండ్ దేవకుమార్, రెవరెండ్ పాల్ రావు, సోషల్ వర్కర్ రెవరెండ్ జీవరత్నం, మెర్సీ అండ్ ట్రూత్ ఉమెన్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పి. డయానా రోజ్ తదితరులు పాల్గొన్నారు.



..

About Author