చెన్నై న్యూస్:తెలుగు భాష, సాహిత్యాలకే కాకుండా ఎంతో మంది పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సాయం చేసిన మానవతామూర్తి యర్రమిల్లి రామకృష్ణ అని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక సమితి అధ్యక్షులు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర రావు కొనియాడారు.ఇటీవల అనారోగ్యంతో మరణించిన అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక సమితి వ్యవస్థాపకులు వైవీ రామకృష్ణ కి నివాళ్ళు అర్పించేలా ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం సాయంత్రం చెన్నై టి.నగర్ లోని ఆంధ్ర బాలానంద విద్యాలయంలో సంతాప సభ నిర్వహించారు.ముందుగా సమితి అధ్యక్షుడు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర రావు వైవీ రామకృష్ణ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సభలో పాల్గొన్న సమితి నిర్వహకులు, తెలుగు భాషాభిమానులంతా కలసి రెండు నిమిషాలు పాటు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని నివాళ్ళు అర్పించారు.అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభను ఉద్దేశించి అజంతా శంకర రావు మాట్లాడుతూ తెలుగు భాషా పోషకులు వై ఎస్ శాస్త్రి ద్వితీయ పుత్రుడు యర్రమిల్లి రామకృష్ణ విదేశాలలో ఉన్నత ఉద్యోగం వదులుకుని మాతృభాష పై పెంచుకున్న మమకారంతో స్వదేశానికి తిరిగివచ్చి పొట్టి శ్రీరాములు స్ఫూర్తిగా చివరి క్షణం వరకు తరించిన మహనీయుడు అని కీర్తించారు.ఆయన కల్లా కపటం లేకుండా అందరినీ సమానంగా ప్రేమించిన మానవతామూర్తి అని కొనియాడారు.ఆర్ధికంగా వెనుకబడిన పిల్లల చదువుకు ఫీజులే కాకుండా పలు తెలుగు సంఘాలకు కూడా ఆర్ధిక సాయం అందజేశారన్నారు. ఆయన మరణం తమ సంస్థకే కాక , తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. సాహితీ , సమాజ సేవలో రాణించి కీర్తిని మూటగట్టుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లారని ఈ సందర్భంగా రామకృష్ణను కీర్తించారు.అనంతరం వైవీ రామకృష్ణ సోదరుడు రామన్ మాట్లాడుతూ తన సోదరుడు రామకృష్ణ తన జీవితాన్ని తెలుగు భాషాభివృద్ధికి , సమాజ సేవకే త్యాగం చేశారని ఆయన సేవను అలాగే కొనసాగించాలని సమితి నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు జె కె రెడ్డి రామకృష్ణ ను స్మరిస్తూ పద్యం అలపించి వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.కవి , విమర్శకులు డాక్టర్ కాసల నాగభూషణం కూడా ఓ కవితను వళ్ళించి రామకృష్ణ తనకెంతో ఆత్మీయులు అని పేర్కొన్నారు. వై వీ
రామకృష్ణ ప్రఖ్యాత నవలా రచయిత్రి మాలతీ చందూర్ మానసపుత్రుడని కొనియాడారు.ఈ సంతాప సభలో సమితి ఉపాధ్యక్షుడు డాక్టర్ అనంత పద్మనాభ మూర్తితో పాటు డాక్టర్. కల్పన గుప్తా , గుర్రం బాలాజీ , జయశ్రీ , శివసుబ్రహ్మణ్యం,
మాధురి, తెలుగు తరుణి అధ్యక్షురాలు కె. రమణి , డబ్ల్యూ టి ఎఫ్ కార్యదర్శి శ్రీలక్ష్మి మోహన రావు, ప్రముఖాంద్ర సంపాదకులు గోటేటి వెంకటేశ్వర రావు, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ రెంటాల జయదేవ, బాలానంద విద్యాలయ కరస్పాండెంట్ పద్మావతి, గాయని ఎస్పీ వసంత, లావణ్య, శ్రీరాజాలక్ష్మి ఫౌండేషన్ ట్రస్టీ పి.వెంకట రావు, కేసరీ స్కూల్ టి. నగర్ ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య, మద్రాసు మువ్వలు సభ్యులు, తెలుగు ప్రముఖురాలు ఉప్పులూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొని రామకృష్ణ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాని పలువురు ప్రముఖులు తమ సంతాప సందేశం పంపించారు.ఇందులో ప్రముఖులు
యార్లగడ్డ ప్రసాద్ , సి ఎం కె రెడ్డి లు రాలేకపోగా సంతాప సందేశాన్ని పంపించగా , వారి సందేశాన్ని కల్పన గుప్తా సభలో చదివి వినిపించారు.
…
More Stories
டாஸ்மாக் கடையில் பாட்டிலுக்கு 10 ரூபாய்க்கு மேல் வசூல் செய்தால் பணிபுரியும் அனைவரும் தற்காலிக பணியிடை நீக்கம்
Every Mix Tells a story: Le Royal Méridien Chennai’s Fruit Mixing Ceremony
CATALYST PR Wins Bronze at PRCI Awards!