December 17, 2024

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలుటిటిడి ఎల్ఎసి మెంబర్ వి. రాధాకృష్ణ

చెన్నై న్యూస్ :ఇటీవల టీటీడీ సలహా మండలి సభ్యునిగా నియామనo చేయబడ్డ వి .రాధాకృష్ణ చేత ఈ నెల 14 గురువారం స్థానిక టీ .నగర్ వెంకట నారాయణ రోడ్ లో ఉన్న టి టి డి సమాచార కేంద్రంలో ఎల్ ఏ సి అధ్యక్షులు ఏజే .శేఖర్ రెడ్డి సమక్షంలో పదవీ ప్రమాణం చేయడం జరిగింది. వేద పండితుల ఆశీర్వాదాలు పొందిన తర్వాత రాధాకృష్ణ మాట్లాడుతూ నాకు ఈ అవకాశాన్నిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారికి, తమిళనాడు పాండిచ్చేరి సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలతో భక్తులకు సేవ చేసే భాగ్యం కలగటం మహాభాగ్యం అని అన్నారు. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలపకుండా నా వంతు సేవలు అందిస్తానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో విజయకుమార్, సలహా మండలి సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి, మోహన్ రావు, డాక్టర్ సీఎం .కిషోర్, మాజీ మంత్రివర్యులు గోకుల ఇందిర, ద్రావిడ దేశం కృష్ణారావు, మాజీ సలహా మండలి సభ్యులు మన్నం రవిబాబు, వ్యాపారవేత్త ఎరుకలయ్య , పులల్ కావాంగరై తెలుగు అసోసియేషన్ సభ్యులు జి. మురళి, ఓబుల్ రెడ్డి, చిట్టిబాబు , మూర్తి , కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author