చెన్నై న్యూస్ :కాలజ్ఞాన రచయిత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 331వ ఆరాధన మహోత్సవం మే 17 వ తేదీ శుక్రవారం చెన్నై కొరట్టూర్ లోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమంలో వైభవంగా జరిగింది. శ్రీ వీర బ్రహ్మేంద్రస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 18 వ వార్షిక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన శుక్రవారం ఉదయం 7:30 గంటలకు శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి వార్ల అభిషేకాలతో వైభవంగా ప్రారంభం అయ్యాయి. అనంతరం 9 గంటలకు లోక కళ్యాణార్ధం సహస్ర నమార్చన, యగపూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 10 గంటలకు యగా వైభవంపై వేదపండితులు ఉపన్యసించి ఆకట్టుకున్నారు. ఆరాధన మహోత్సవ పూజలను ఆంధ్రప్రదేశ్ ఏలూరు కు చెందిన సాయి కుమార్ శర్మ బృందం చేశారు. వైశాఖ శుద్ధ దశమి రోజున పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవ సమాదిలోకి ప్రవేశించిన సందర్భంగా ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆశ్రమంలో మహా అన్నదాన కార్యక్రమంలో నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలకు భగవాన్ శ్రీ బాల సాయిబాబు సేవా సమితి నేతృత్వంలో భజన గీతాలు అలపించి భక్తులను ఆధ్యాత్మిక సాగరంలోకి తీసుకెళ్లారు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై అంటూ భక్తుల నినాధాలు మిన్నంటాయి .శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవ ఏర్పాట్లను శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు T.వీరభద్రరావు, కార్యదర్శి A.S..బలరామ మూర్తి ,కోశాధికారి N. కిషోర్ , ట్రస్టీ లు K.సీతారామ శర్మ, B.S రావు, సభ్యులు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కార్యదర్శి A.S. బలరామ మూర్తి మాట్లాడుతూ కొరట్టూర్ ప్రాంతంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమం ఏర్పాటు చేసి వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది, ఇంకా మండపాలు కట్టాల్సి ఉందన్నారు .ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దాతల వస్తూ రూపేన , ధన రూపేనా సహకారం అందించాలని కోరారు. మరిన్ని వివరాలకు ట్రస్ట్ నిర్వాహకులను సంప్రదించాలని వెల్లడించారు.
…
More Stories
సూర్యకాంతం నటన అనితరసాథ్యం- నటి పద్మిని వ్యాఖ్య
உலக தியான தினம் குறித்த முக்கிய உரை நாளை இந்திய நேரப்படி இரவு எட்டு மணி அளவில் நிகழ்த்த உள்ளது
NATIONAL OPEN ROTARY PARA TABLE TENNIS TOURNAMENT – SEASON3