December 24, 2024

వైభవంగా శ్రీ మాతమ్మ దేవస్థానం జీర్ణోద్ధారణ అష్టబంధన మహా కుంభాభిషేకం

చెన్నై న్యూస్:తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్న చెన్నై పాత చాకలిపేట పరశురామన్ వీధిలో దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన శ్రీ మాతమ్మ దేవస్థానం జీర్ణోద్ధారణ అష్టబంధన మహా కుంభాభిషేకం ఫిబ్రవరి 22వ తేదీ గురువారం శాస్త్రోక్తంగా జరిగింది.ఈ పురాతన ఆలయానికి బాలాలయం, జీర్ణోద్ధరణ పనులను ఆలయ నిర్వాహకులు పూర్తి చేసిన సందర్భంగా నూతన ఆలయ ప్రాంగణంలో ఫిబ్రవరి 19నుంచి ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలను నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ పెద్దలు, గ్రామస్తులు, కార్యనిర్వాహక కమిటీ, తిరుమల పాదయాత్ర భక్తులు, పెంచల నరసింహస్వామి భక్తులు, వెంకటేశ్వర కళా మందిర్, జిష్ణు గణపతి సభ్యులు, మణికంఠన్ సేవా సమితి భక్తులు, పలువురు దాతల సమక్షంలో ఆలయ ప్రధాన గోపురాలపై ప్రతిష్ఠించిన కలశాలకు పవిత్ర జలాలతో మహా కుంభాభిషేకం క్రతువును వైభవంగా నిర్వహించారు.అర్చకులు పవిత్ర పుణ్యజలాలను భక్తుల పై చల్లగా పరవశించిపోయారు.శ్రీ మాతమ్మ వారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు తీర్థ ,అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.కార్యక్రమం ఏర్పాట్లును కొరుక్కుపేట పేట గ్రామపంచాయతీ పెద్దలు,శ్రీ మాతమ్మ వారి దేవస్థానం కార్యనిర్వాహకులు , యువకులు పర్యవేక్షించారు.
..

About Author