November 15, 2024

శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి 500వ శుక్రవారం తాంబూలం

చెన్నై : వాసవీ క్లబ్ ఆఫ్ షావుకారు పేట చెన్నై, వాసవీ క్లబ్ ఆఫ్ వనిత షావుకారు పేట చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి 500వ శుక్రవారం తాంబూలం సమర్పణ కార్యక్రమం కనులపండువుగా సాగింది.

చెన్నై జార్జిటౌన్ లోని 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవస్థానం వేదికైంది. ఈ సందర్భంగా జులై 28వ తేదీ శుక్రవారం రాత్రి 6:30 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు శ్రీ లలితా సహస్ర నామ సామూహిక పారాయణం, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి తాంబూలం సమర్పణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
లోక కళ్యాణం కోసం చేపట్టిన ఈ పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సామూహిక పూజలు చేసి వాసవీ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.వాసవీ క్లబ్ ఆఫ్ షావుకారు పేట చెన్నై, వనిత క్లబ్ తరపున 500వ శుక్రవారం తాంబూలం సమర్పణలో 102 రకాల పూజా సమగ్రీని నైవేద్యంగా సమర్పించారు.వాసవీ క్లబ్ ఆఫ్ షావుకారు పేట చెన్నై, వాసవీ క్లబ్ ఆఫ్ వనిత షావుకారు పేట చెన్నై అధ్యక్షులు ఎస్ వి పద్మనాభన్, విష్ణు ప్రియ , సెక్రెటరీలు కె ఆర్ వరద రాజన్, శాంతకుమారి, కోశాధికారులు ఎస్ మోహన్ దాస్, భువనేశ్వరి ల పర్యవేక్షణలో ప్రాజెక్టు చైర్మన్లు ఏ ఆర్ బద్రి నారాయణన్ ,మహాలక్ష్మి, కో -ప్రాజెక్టు ఛైర్మన్ లు వై. వెంకటేశ్వర్లు, హరిప్రియ ఈ పూజలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎస్ కె పిడి ట్రస్టీ దేసు లక్ష్మీ నారాయణ, ఇంద్రాణి దంపతులు పాల్గొని నిర్వాహకుల సేవలను కొనియాడారు.
ఈ వేడుకల్లో మాజీ అధ్యక్షులు ఎంవి నారాయణ గుప్తా, నామా సతీష్, అచ్చా ఆనంద్, రాజేష్,జగదీష్, పొన్నూరు వెంకట సుబ్బారావు తదితరులు, ఇంకా సభ్యులు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.
..

About Author