చెన్నై న్యూస్ : సామాజిక, ఆధ్యాత్మిక, సాంఘిక సేవలను విస్తృతంగా చేపడుతున్న శ్రీ ఆంధ్ర కళాస్రవంతి ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి . చెన్నై అరుంబాక్కంలోని డి.జి. వైష్ణవి కళాశాల ద్వారకా అడిటోరియం వేదికగా ఏప్రిల్ 9 తేది మంగళవారం రాత్రి సాగిన ఈ వేడుకలకు శ్రీ ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జేఎం నాయుడు అధ్యక్షత వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆదిత్యా గ్రూప్ ఛైర్మెన్ ఆదిత్యారామ్ , విశిష్ట అతిథులుగా ఐఎస్‌పి గ్రూప్ ప్రమోటర్ బద్రీనారాయణ ప్రసాద్ ప్రముఖ సినీగేయ రచయిత భువనచంద్ర పాల్గొని జ్యోతిప్రజ్వలనతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ముందుగా సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశారు . స్నేహాంజలి ఆర్ట్స్ – విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో కూచిపూడి, అరకు ధింసా, ఫ్యూజన్ నృత్యప్రదర్శన, కాంతారి, శ్రీశ్రీనివాస కళ్యాణ నృత్య ప్రదర్శన, శివతాండవము, స్ప్రింగ్ నృత్యం, పాటల ప్రదర్శనలతో కనువిందు చేశారు . అనంతరం వేద పండితులు సుసర్ల కుటుంబశాస్త్రి పంచాంగ పఠనం చేస్తారు. శ్రీ ఆంధ్రకళా స్రవంతి అధ్యక్షులు జె.ఎం. నాయుడు స్వాగతోపన్యాసం చేస్తూ తెలుగుప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు . పలువురు దాతల సహకారంతో పేద విద్యార్థులకు తమవంతు సాయం చేస్తున్నామని చెప్పారు . ప్రధానకార్యదర్శి జె.శ్రీనివాస్ కార్యదర్శి నివేదిక సమర్పించారు.అలాగే స్రవంతి సలహాదారు ఎం.ఎస్. మూర్తి అభినందన ప్రసంగం చేస్తూ ఎన్నో ఒడుదుడుకులు తట్టుకుని ప్రస్తుతం తమ స్రవంతి అందరికీ ఆదర్శమైన అసోసియేషన్‌గా ఎదిగిందని తెలిపారు . వి.సరితకుమారి సౌజన్యంతో శ్రీ ఆంధ్రకళా స్రవంతి ఉగాది పురస్కారాన్ని తెలుగు ఉపాధ్యాయులు డ్ఢా్ఢఎ.మనోహరన్ కు అతిథుల చేతులమీదుగా అందజేశారు ప్రతిభను చాటిన విద్యార్థినీ విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లను ప్రదానంచేశారు . ఇందులో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (రాజ్యసభ సభ్యులు) సౌజన్యంతో దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ బ్యాగ్లు ప్రదానం చేస్తారు. అలాగే ఎస్. నిరంజన్ కుమార్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర తెలుగు విద్యాలయం విద్యార్థులకు స్కూల్ యూనిఫాం వితరణ చేస్తారు. ఇంకా ఆర్.ఎమ్.కె. విద్యాసంస్థల సౌజన్యంతో 12వ తరగతిలో తెలుగు పాఠ్యాంశంలో 90 మార్కులు దాటిన 5 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున నగదు బహుమతి ప్రదానంచేశారు.
అలాగే శ్రీ జయావిద్యానిలయముల సమాహార యాజమాన్యం సౌజన్యంతో ముగ్గురు 10వ తరగతి తెలుగు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున నగద బహుమతులు అందజేస్తారు. ఇంకా ఆంధ్రకళాస్రవంతి సభ్యులు జి. జగన్మోహనరావు, చారుగుండ్ల, వెంకటేశ్వరరావు, సి. హెచ్. సాంబశివరావు, శ్రీ రాజలక్ష్మీ ఫౌండేషన్, డి.ఆర్. కిరణ్, వి.ఎన్. అచ్యుత రామగుప్త, వి. వీరభద్రరావు, ఎమ్. చలపతి, రావి సాంబశివ రావు, ఎం. జమునా నారాయణ, బి. ఎన్ గుప్తా సౌజన్యంతో 10 మంది తెలుగు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు రూపాయలు నగదు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, స్రవంతి సభ్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి ప్రార్ధన గీతాన్ని యడవల్లి ఆరుణా శ్రీనాథ్ అలపించగా , వ్యాఖ్యాతలుగా అల్ ఇండియా రేడియో కుమారి బిట్రా గజగౌరి,డాక్టర్ మందలపు నటరాజ్ వ్యవహరించారు. చివరగా కార్యక్రమంలో భాగంగా స్రవంతి కోశాధికారి.జి.వి.రమణ వందన సమర్పణ చేశారు . ఈ కార్యక్రమంలో స్రవంతి ఉపాధ్యక్షులు కె ఎన్ సురేష్ బాబు , పి సరస్వతి , వి ఎన్ హరినాథ్ , సభ్యులు, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం ఉగాది విందు ను అందించారు.
More Stories
Rotary Wellness Run & Walk 2024 Successfully Promotes Health and Community Spirit
Successful Completion of the “STOP and WATCH” Road Safety Awareness Campaign by VS Hospitals and Chennai Traffic Police
ఘనంగా నరసింహ నగర్ కెనాల్ తెలుగు బాప్టిస్టు సంఘం 50వ వార్షికోత్సవ వేడుకలు