September 20, 2024

ఆర్యవైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పంపిణీ

చెన్నై న్యూస్: ఆర్యవైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ( ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో నివశిస్తున్న నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందిస్తూ వారి విద్య అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఆ ఫౌండేషన్ అధ్యక్షులు K. రవికుమార్ సారధ్యంలో విద్యార్థులకు మేమున్నాం అంటూ విద్యార్థులను ఉన్నత చదువులు వైపు పయనింపజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులు చదువుతున్న విద్యార్థులతో పాటు ఇంజనీరింగ్ , ఎంబిబిఎస్ వంటిబ్ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు పూర్తి ఫీజు మొత్తాన్ని స్కాలర్ షిప్ గా అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు .అందులో భాగంగా చెన్నైలో ఇటీవల తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై తరఫున జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిఎంఆర్ గ్రూప్ డైరెక్టర్ బొమ్మిడాల మణిసంతోష్ ,తారణ ల చేతుల మీదుగా ఫౌండేషన్ తరపున 17 మంది విద్యార్థులకు రూ.10 లక్షల స్కాలర్ షిప్ లను అందించారు . ఇందులో అధ్యక్షులు రవికుమార్ తో పాటు సెక్రటరీ రాధాకృష్ణన్ బాలాజీ కోశాధికారి శ్రీధర్ , కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.త్వరలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందించనున్నట్టు రవి కుమార్ తెలిపారు.

About Author