December 22, 2024

ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

చెన్నై న్యూస్: శ్రీపెరంబుదూర్ పెన్నలూర్
లో అన్నై హాస్పిటల్ మెడికల్ కళాశాల తరపున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నగరిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో సామాన్య ప్రజల కోసం ఉచిత ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హాస్పిటల్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ హరిశంకర్ మేఘనాథన్ సతీమణి డాక్టర్ అపూర్వ
హరిశంకర్ మేఘనాథన్ శిబిరాన్ని ప్రారం భించారు. దీనికి ఆనుపత్రి డీన్ వనిత అధ్యక్షత వహించారు. ఈ వైద్య శిబిరంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా 500 మందికి పైగా సామాన్య ప్రజలు పాల్గొన్నారు. కంటి, చెవి, ముక్కు, గొంతు, చర్మంతో పా టు అన్ని సంబంధిత వ్యాధులకు ఉచితంగా వైద్యం చేసి వైద్య సలహాలు, మందులు అందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పేద ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

About Author