December 23, 2024

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి

చెన్నై న్యూస్: దేశ మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు
జగ్జీవన్ రామ్ 117వ జయంతిని శుక్రవారం చెన్నై నగరంలో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాలతో ఎమ్మార్పీఎస్ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు లోకేష్ కుమార్ సూచనలతో చెన్నైబీచ్ వద్ద ఎలిలగం ప్రాంగణంలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ శిలా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ తరపున పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించి ఆయన సేవలను స్మరించు కున్నారు. ఎమ్మార్పీస్ తమిళనాడు ప్రధాన కార్యదర్శి కావలి సుకుమార్ మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి సమసమాజ స్థాపనకోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఆయనను యువత స్పూర్తిగా తీసుకుని ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు ఇరకట్ల నాగభూషణం మాట్లాడుతూ భారతదేశానికి ఎంతో మేలులు చేసిన జగ్జీవన్ రామ్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఆయన చేసిన సేవలు చిరస్మరనీయమైనవని అన్నారు . ఈ కార్యక్రమంలో టామ్స్ పాల్ కొండయ్య , ఎమ్మార్పీఎస్ కోశాధికారి బక్కా పౌల్ , వైస్ ప్రెసిడెంట్ ఎం.బాలాజీ, కే. సి. కొండయ్య, ఇంకా వై ఎస్ శ్రీరామ్ , వి.దీనదయాలన్, దిలీపన్, కుమార్, విజయ్ తదితరులు పాల్గొని జగ్జీవన్ రామ్ కి
నివాళి అర్పించారు.

About Author