December 23, 2024

ఎమ్మార్పీఎస్ తమిళనాడు ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 133వ జయంతి

చెన్నై న్యూస్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS)-తమిళనాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. చెన్నై హార్బర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ తమిళ నాడు అధ్యక్షులు లోకేష్ కుమార్ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా లోకేష్ కుమార్ , పుల్లాపురం ఆది ఆంధ్ర సేవా సంఘం అధ్యక్షులు ఇరకట్ల నాగభూషణం, సంఘం సెక్రటరీ కన్నెమరకల కుమార్, సంఘం కోశాధికారి గొల్లపల్లి గోపిలు మాట్లాడారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానీయుడు
డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆది ఆంధ్ర అరుంధతీయులకు అందిస్తున్న రిజర్వేషన్ ను 3 శాతం నుంచి 6 శాతానికి పెంచాలని అలాగే ఆది ఆంధ్ర అరుంధతీయులకు అందిస్తున్న కులదృవీకరణ సర్టిఫికేట్ ను మాదిగ అనే పేరిట ఇవ్వాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు ఈ సందర్భంగా
విజ్ఞప్తి చేశారు.. ఇంకా ఎమ్మార్పీఎస్ కు చెందిన దేవసహాయం తదితరులు పాల్గొన్నారు

About Author