November 21, 2024

ఎస్ కె పి సి లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సంబరాలు

చెన్నై న్యూస్ : చెన్నైలోని శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల ( SKPC)లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు, తమిళ నూతన సంవత్సర సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కళాశాల ప్రాంగణంలో సోమవారం జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినిలు, అధ్యాపకులు హిందూ సంస్కృతి సంప్రదాయలు,తెలుగుదనం ఉట్టిపడే రీతిలో పాల్గొని కనువిందు చేశారు. విద్యార్థినిలు ఉగాది పండుగ రంగోళిలను, బతుకమ్మలను ఎంతో సుందరంగా వేసి శ్రీ క్రోధి నామ సంవత్సర
తెలుగు ఉగాది పండుగకు స్వాగతం పలికారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి మోహన శ్రీ అధ్యక్షతన జరిగిన ఈవేడుకల్లో కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్ పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంబించారు. ఆయన మాట్లాడుతూ శ్రీ కోధి నామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషంగా జీవించాలని, తమ కళాశాలలో చదువుతున్న విద్యార్ధినిలు ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీకన్యకా పరమేశ్వరీ, సరస్వతిదేవిలకు ప్రత్యేక పూజలను చేసి ,కర్పూర హారతులు పట్టారు. విద్యార్థినిలు
భక్తి పాటలను శ్రావ్యంగా ఆలపించారు.ఈ వేడుకల్లో కళాశాల డీన్ డాక్టర్ PB వనిత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ MV నప్పిన్నై, తమిళ అధ్యాపకురాలు లక్ష్మీ, తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ PS మైథిలీ, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ముందుగా ప్రిన్సిపాల్ డాక్టర్ టి మోహనశ్రీ మాట్లాడుతూ ముందుగా తెలుగు తమిళ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరం 60 తెలుగు సంవత్సరాలలో 38వ దని చెప్పారు. క్రోధి నామ సంవత్సరం అంతా అందరికీ మేలులు చేకూర్చాలని అన్నారు. అలాగే శ్రీ క్రోధి నామ సంవత్సరం విశిష్టతను, షడ్రుచుల సారాంశాన్ని జీవితానికి అన్వయిస్తూ విద్యార్థులకు వివరించి ఆకట్టుకున్నారు.అందరికీ ఉగాది పచ్చడి , వడపప్పు,పానకం లను అందించారు. విద్యార్థినిలు, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం అంతా కలసి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
..

About Author