November 22, 2024

ఎస్ కేపీడీ ఛారిటీస్,అతిదేయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో కె. రవి కుమార్, రవిచంద్రన్ లకు సత్కారం

చెన్నై న్యూస్: దానాల కన్నా అన్నదానం ఎంతో
అత్యుత్తమమైనదని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం (ఎస్ కె పి డి ) వంశ పారంపర్య ధర్మకర్త కొల్లా వేంకట చంద్రశేఖర్ అన్నారు. ఎస్ కేపీడీ ఛారిటీస్ , అతిదేయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోద్యను దర్శించేందుకు వచ్చిన భక్తులకు జనవరి 19 నుంచి 33 రోజుల పాటు అంకిత భావంతో అన్నదానం నిర్వహించిన చెన్నైకి చెందిన అయోధ్య ఆర్యవైశ్య చారిటబుల్ ఫౌండేషన్, ఎస్వీఏసీ ఫౌండేషన్ చైర్మన్ కె. రవికుమార్, కార్తీక్ టిఫిన్ సెంటర్ అధినేత రవి చంద్రన్ లకు అభినందన సభ మార్చి 10వ తేదీ ఆదివారం ఘనంగా జరిగింది. ఎస్ కె పి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
కొల్లా వేంకట చంద్రశేఖర్ పాల్గొన్నారు. అన్నదాతలు రవికుమార్, రవి చంద్రన్లతో పాటు వాలంటీర్లు, వంట వాళ్లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పాలకమండలి సభ్యుడు ఊటుకూరు శరత్ కుమార్ స్వాగతం పలకగా, మరో సభ్యులు ఎస్ఎల్ సుదర్శనం వందన సమర్పణ చేశారు. పాలక మండలి సభ్యులు దేసు లక్ష్మీనారాయణ, టీవీ రామకుమార్, సీఆర్ కిషోర్ బాబు తో పాటు పాలకమండలి మాజీ సభ్యులు ఉరా ఆంజనేయులు, అజంతా గ్రూప్ అధినేత అజంతా శంకర రావు, మద్ది నరసింహులు, వి ఎన్ హరినాధ్, ఎం వి నారాయణ గుప్తా, మా వాసవీ ట్రస్ట్ వ్యవస్థాపకులు బాలాజీ,వీర ప్రతాప్, ఇంకా ఇమ్మిడి కిషోర్, మోహన శ్రీ , మల్లికా ప్రకాష్, లీలారాణి,శ్రీలక్ష్మీమోహన రావు ,ఆర్యవైశ్య ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాలక మండలి మాజీ సభ్యులు పప్పిశెట్టి శ్రీరాములు తది తరులు అయోధ్యలో తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఎస్ కె పిడి చారిటీస్ కార్యదర్శి ఎం. కిషోర్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా వీణా వాయిద్య కారిణి పద్మలత బృందం వీణా వాయిద్య కచ్చేరితో అలరించారు. చివరిగా నిర్వాహకులకు రవి కుమార్, రవి చంద్రన్ లు కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author