చెన్నై న్యూస్: చెన్నై జార్జ్ టౌన్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం (SKPD )లో శ్రీ వాసవి జయంతి మహోత్సవం వైభవంగా జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర పంతులు బృందం శ్రీ కన్యకా పరమేశ్వరి మూలమూర్తి, ఉత్సవమూర్తిలకు త్రికాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, ఆరాధనలు సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. మరోవైపు హోమ పూజలను శాస్త్రోక్తంగా జరిపారు.ఎస్ కె పి డి పాలక మండలి సభ్యులు ఊటుకూరు శరత్ కుమార్, దేసు లక్ష్మీనారాయణ, ఎస్ ఎల్ సుదర్శనం, టీవీ రామకుమార్, సి ఆర్ కిషోర్ బాబు, టీఎస్ బద్రీనాథ్ లు శ్రీ వాసవాంబ జన్మస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నుంచి శ్రీ వాసవి జ్యోతిని నగరానికి తెప్పించారు.
చేట్ పేట లోని ఎస్ కె పి డి విద్యార్థి వసతిగృహం నుంచి శ్రీ వాసవి జ్యోతి తో పాలక మండలి సభ్యులు భక్తిశ్రద్ధలతో వెంటరాగా గోవిందప్ప నాయక్ వీధిలోని ఎస్ కే పి డి బాలుర మహోన్నత పాఠశాల నుంచి పెద్ద ఎత్తున పల్లకీలలో శ్రీ కన్యకా పరమేశ్వరి చిత్రపటాన్ని కొలువు తీర్చి ఊరేగింపు నిర్వహించారు. దాదాపు వెయ్యి మంది మహిళలు పాల బిందెలను వెంట తీసుకొని జై వాసవి జై జై వాసవి అనే నినాదాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు, కేరళ కళాకారుల వాద్య బృందం, ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. గోవిందప్ప నాయక్ వీధి నుంచి బయలుదేరిన ఊరేగింపు పి వి అయ్యర్ వీధి, వరదా ముత్తి యప్పన్ వీరి, ఆది అప్ప నాయక్ విధులు గుండా ఆలయానికి తిరిగి చేరుకుంది. నగరంలోని వివిధ వైశ్య ధర్మసంస్థల నిర్వాహకులతో పాటు పాలకమండలి మాజీ సభ్యులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భాస్కర పంతులు బృందం అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవ మూర్తికి పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు.వివిధ రకాల పుష్పాలతో అలంకరించి విశేష దీపారాధన జరిపారు. భక్తులందరికీ అమ్మవారి అన్న ప్రసాదాలు, పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యదర్శి ఎం కిషోర్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 102 మంది గాయనీ గాయకులతో కూడిన రాగ మాలిక బృందం అమ్మవారికి సంగీతాంజలి సమర్పించారు.
అలాగే…గిడ్డంగి వీధిలోని 120 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ ఇండియా వైశ్య సంఘం లో శ్రీ వాసవి జయంతి మహోత్సవ సందర్భంగా సంఘం అధ్యక్షులు అజంతా అధినేత డాక్టర్ కనిగెలుపుల శంకరరావు, విజయలక్ష్మి నేతృత్వంలో 501 పాల బిందెలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. . ఇందులో సంఘం సంయుక్త కార్యదర్శులు M. నరసింహులు, P. అశోక్ కుమార్, కోశాధికారి P. రమేష్ లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉపాధ్యక్షులు ఎం ఉదయ్ కుమార్, జిపివి సుబ్బారావు లతోపాటు కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అలాగే…అన్నా నగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు, గోపురం అధినేత Y.V . హరికృష్ణ సారధ్యంలో జార్జి టౌన్ ఆదియప్ప నాయక్ వీధిలోని గోపురం భవనం నుంచి 108 పాల బిందెలతో మహిళలు జై వాసవి నినాదాలు చేసుకుంటూ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి ఊరేగింపుగా వచ్చారు. అమ్మవారికి ఆడపడుచు లాంఛనాలుగా 11 మర్యాద తట్టలు కూడా వెంట తీసుకొచ్చి సమర్పించారు. గత 29 సంవత్సరాలుగా ప్రతి ఏటా శ్రీ వాసవి జయంతి మహోత్సవం రోజున ఉదయం 7:30 గంటలకు నిర్వహించే తొలి అభిషేకానికి తమ సంఘానికి అవకాశం లభించడం అమ్మవారి అనుగ్రహం అని హరికృష్ణ చెప్పారు. కార్యదర్శులు ఎం కాశీ విశ్వనాథం, ఎస్ వి ప్రసాద్ రావు, కోశాధికారి A. శ్రీనివాసులు, ముక్కాల భాష్యకారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.అలాగే గోమాత సేవా సమితి తరపున గోపూజ, అభిషేకాలను సమితి వ్యవస్థాపకులు దయాలం వాసు దేవన్, పుష్పంభ లు పాల్గొని ఆలయంలో పూజలు చేశారు. అదే విధంగా తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై ఛైర్మన్ కె కె త్రినాధ్ కుమార్ అధ్యక్షతన తిరువళ్లురు జిల్లా తిరూర్ లోని కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ప్రాజెక్టు చైర్మన్ ఎస్వీ పద్మనాభం పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వాసవి జ్యోతిని వాహనం ద్వారా జార్జ్ టౌన్ లోని కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి తరలించి ఎస్ కె పి డి ట్రస్టీలకు అప్పగించారు
More Stories
సూర్యకాంతం నటన అనితరసాథ్యం- నటి పద్మిని వ్యాఖ్య
உலக தியான தினம் குறித்த முக்கிய உரை நாளை இந்திய நேரப்படி இரவு எட்டு மணி அளவில் நிகழ்த்த உள்ளது
NATIONAL OPEN ROTARY PARA TABLE TENNIS TOURNAMENT – SEASON3