December 22, 2024

ఐసిఎఫ్ ఎన్ డానియల్ పదవీ విరమణ -తెలుగు ప్రముఖులు శుభాకాంక్షలు

చెన్నై న్యూస్:వృత్తి ఐసిఎఫ్ లో ఉద్యోగం…ప్రవృత్తి మాత్రం నాటక రంగానికి సేవలు… అంతకుమించి తెలుగు భాష మీద అమితమైన ఆసక్తితో రెండు దశబ్ధాలకు పై తెలుగు దిన పత్రికలో పాత్రికేయులుగా పని చేస్తూ తెలుగు భాష సాహిత్యాల వికాసానికి ఎనలేని సేవలు అందిస్తున్న ఐసిఎఫ్ ఎన్ డానియల్ పదవీ విరమణ పొందారు. ఆదివారం జరిగిన పదవి విరమణ కార్యక్రమంలో నగరంలోని పలువురు తెలుగు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎన్. డేనియల్ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ’ (ఐసీఎఫ్) లో 30 సంవత్సరాల పాటు పని చేసి జూన్ 30,2024 ఆదివారం పదవీ విరమణ పొందారు. గ్రేడ్ 1 ఫిట్టర్ జనరల్ గా పదవీ విరమణ పొందిన డేనియల్ నగరంలోని పలు తెలుగు సంస్థలు, తెలుగు వారికి సుపరిచితులు. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ . ఉద్యోగంలో ఉంటూనే నాటక రంగం మీద స్వతహాగా ఆసక్తి కలిగిన వ్యక్తి కావడంతో ఐపీఎఫ్ తెలుగు సంఘం తరపున నిర్వహించిన పలు పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక నాటకాల్లో మంచి పాత్రలు పోషించి, అందరి మన్ననలు పొందారు. అవడి సమీపం తిరుముల్లైవోయల్లో జరిగిన పదవీ విరమణ కార్యక్రమానికి ఆలిండియా తెలుగు ఫెడరేషన్ (ఏఐటీఎఫ్) అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి, తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబు, జనని సంస్థ అధినేత గుడిమెట్ల చెన్నయ్య తదితరులు విచ్చేసి డేనియల్ కు పదవీ విరమణ శుభాకాంక్షలందజేశారు. ఆయురారోగ్యాలతో , ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. తెలుగు పాత్రికేయులు ఎన్ డానియల్ కు శుభాకాంక్షలు తెలిపారు.

About Author