December 24, 2024

ఓబిసి వర్గాల వారి డిమాండ్లను పరిష్కరించండి-రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్

చెన్నై: రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా చెన్నై విచ్చేసిన ఓబీసీ వర్గాల సంక్షేమ పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు , రాజ్యసభ సభ్యులైన హరినాథ్ సింగ్ యాదవ్ ను రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ ,ద్రవిడ దేశం అధ్యక్షులు వి. కృష్ణారావు , తమిళనాడు యాదవ మహాసభ అధ్యక్షులు డాక్టర్ జె .రామచంద్ర యాదవ్ లు కలిశారు. ఈ సందర్భంగా ఓబిసి వర్గాల సంక్షేమానికి త్వరితగతిన చేపట్టవలసిన 9 డిమాండ్లను ఓబిసి కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.

  1. కుల గణన చేపట్టటం మరియు ఓబీసీల స్థితిగతులపై అంచనా,
  2. రిజర్వేషన్ల అమలు,
  3. క్రిమి లేయర్ ప్రమాణాలను సమీక్షించి ఆదాయ పరిమితిని పెంచుట,
  4. ప్రమోషన్లలో ఓబీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ,
  5. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయుట,
  6. చట్టసభలలో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించుట,
  7. ఓబీసీల సంక్షేమానికి బడ్జెట్ పెంచుట,
  8. విద్యా సంస్థలలో ఫీజు రాయితీ,
  9. ఓబీసీల అభివృద్ధికి కులాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయుట. ఓబీసీల సంక్షేమాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలపై పరిశీలన చేసి తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని హరినాథ్ సింగ్ యాదవ్ ను బీద మస్తాన్ రావు కోరారు.

About Author