December 23, 2024

కాపు కల్యాణ పరిచయ వేదికకు అనూహ్య స్పందన

చెన్నై న్యూస్: కాపు సేవా సమితి ఆధ్వర్యంలో కాపు కల్యాణ పరిచయ వేదిక కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. దీనికి టి.నగర్, విజయ రాఘవ రోడ్డులో గల ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా క్లబ్) కృష్ణా హాలు వేదికగా నిలిచింది. సాయంత్రం 3:30 గంటల నుంచి 7:00 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో కాపు, బలిజ, తెలగ, తెగల వారికి కల్యాణ వేదిక ఘనంగా నిర్వహించారు. అమ్మాయి, అబ్బాయి ఇరు ప్రక్కల నుంచి 70 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇరు జట్టులకు విడివిడిగా అబ్బాయి, అమ్మాయిల వివరములతో కూడిన జాబితా ఇవ్వబడి ఒక్కొక్కరిని వేదికకు పిలిపించి వారి వివరములను సభలో చెప్పే అవకాశం కల్పించారు. అన్ని వివరములు పరిశీలించి వారికి చరవాణి ద్వారా విషయం తెలుపబడునని పేర్కొన్నారు. ఇరు జట్లు ఒకరితో ఒకరు మాట్లాడుటకు అవకాశం ఇవ్వబడింది. కార్యక్రమమునకు ముత్యాలు వాణిజ్య వేత్త కొట్టే నారాయణ, శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్, వ్యవస్థాపకులు, అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమం ఆద్యంతం కాపు సేవా సమితి అధ్యక్షులు గూడపాటి జగన్మోహనరావు నిర్వహించారు. కాపు సేవా సమితి కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.

About Author