September 20, 2024

కెటిసిటీ పూర్వ విద్యార్థినిల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ, బాలల దినోత్సవ వేడుకలు- 2023

చెన్నై న్యూస్ : చెన్నైకు చెందిన కెటిసిటీ పూర్వ విద్యార్థినిల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, బాలల దినోత్సవ వేడుకలు -2023 లను నవంబర్ 18వ తేదీ శనివారం రోజున ఘనంగా నిర్వహించారు.స్టానిక షావుకారు పేట నారాయణ మొదలి వీధిలోని కె టి సి టి ప్రాథమిక , మహోన్నత పాఠశాలల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలు శ్రీ వాసవీ మాత ప్రార్థనాగీతంతో ప్రారంభమైయ్యాయి.ఈ వేడుకలకు కెటిసిటీ పూర్వ విద్యార్థినిల సంఘం అధ్యక్షురాలు సరళ బాలాజీ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ అసోసియేషన్ తరపున కెటిసిటీ పాఠశాలకు అనేక రకాలుగా సహాయపడు తున్నామన్నారు.అలాగే విద్యార్థినిల అభివృద్ధికి పాటుపడుతున్నట్టు తెలిపారు.కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. కెటిసిటీ బాలికలపాఠశాలలు ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనుందని తెలుపుతూ పదవ తరగతి, ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు 100 శాతం ఫలితాలు అందించాలని కోరారు.

బాలల దినోత్సవ సందర్భంగా చిన్నారులకు ఫాన్సీ డ్రెస్,రూబిక్ క్యూబ్ గేమ్, నిబ్ పెయింటింగ్, నవరసాలు, ముద్రాస్ (ఆరోగ్య సంబంధమైన) తదితర పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన విద్యార్థినిలకు బహుమతులు అందజేశారు. అలాగే పాఠశాల కెమిస్ట్రీ ల్యాబ్ కు స్టూల్స్ , పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థినిలకు అల్పాహారం కోసం విరాళాన్ని కూడా చెక్కు రూపంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సరళ బాలాజీ ,లక్ష్మీ లు అందజేశారు.మధ్యాహ్నం నిర్వహించిన ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులకు వివిధ పోటీలు చేపట్టి బహుమతులతో ఘనంగా సత్కరించారు.సంఘం కార్యదర్శి షర్మిళ, కోశాధికారి లక్ష్మీ తో పాటు కెటి సిటీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కె. అనిల,చుక్కా రేవతి సంఘానికి చెందిన మల్లికా ప్రకాష్ , ఎస్ కె పిడి బాలుర మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓ.లీలా రాణి
తదితరులు పాల్గొన్నారు.

About Author