December 17, 2024

ఘనంగా తెలుగు తరుణి వార్షికోత్సవం రచయిత్రి రామలక్ష్మీ కి శ్రీకాంత బిరుదు ప్రదానం


చెన్నై న్యూస్ : తెలుగు భాష ,సాహిత్య వికాసానికి పాటుపడుతున్న తెలుగు తరుణి సంస్థ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.ఈ వేడుకలకు తెలుగు తరుణి అధ్యక్షురాలు రమణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సాహిత్యానికి విశేష సేవలను అందిస్తున్న ప్రముఖ రచయిత్రి గుమ్మడి రామలక్ష్మి కి తెలుగు తరుణి తరపున శ్రీకాంత బిరుదును ప్రదానం చేశారు.ముందుగా అధ్యక్షురాలు రమణి మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ తెలుగు తరుణిని మాజేటి జయశ్రీ స్థాపించినట్టు తెలిపారు.మహిళ అభ్యున్నతి, మనోవికాశానికి సహాయపడు తున్నామని అన్నారు.సభ్యులందరి సహకారంతో వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపు కున్నామని తెలిపారు.ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీకాంత అవార్డు గ్రహీత రామలక్ష్మి మాట్లాడుతూ తెలుగు కోసం విశేషంగా కృషి చేయటం అభినందనీ యమన్నారు. మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంటూ అవార్డు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. గౌరవ అతిథిగా పాల్గొన్న రెయిన్ బో ఆసుపత్రి దంత వైద్యురాలు డాక్టర్ పావని పాల్గొని చిన్నారుల్లో ఏర్పడే దంత సమస్యలపై అవగాహన కల్పించారు.ముందుగా 2022-23 వార్షిక నివేదికను తెలుగు తరుణి కార్యదర్శి దేవ సేన చదివి వినిపించారు. సంస్థ వ్యవస్థాపకులు మాజేటి జయశ్రీ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళుతున్నట్టు తెలిపారు. నృత్య గురువు అపర్ణ సుదీష్ నేతృత్వంలో మనిమాల ,భార్గవి, వసంత, విశాలాక్షి తదితర సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ వేడుక కార్యక్రమ నిర్వహణను సభ్యులు శైలజ చక్కగా చేపట్టగా, ,ముఖ్య అతిధిని కోశాధికారి మాజేటి అపర్ణ పరిచయం చేశారు. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రముఖులు , మహిళలు పాల్గొన్నారు.



..

About Author