November 13, 2024

ఘనంగా దక్షిణ ఇండియా వైశ్య సంఘం 120వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

చెన్నై న్యూస్: చెన్నై జార్జిటౌన్ గిడ్డంగి వీధిలోని దక్షిణ ఇండియా వైశ్య సంఘం (శివ) 120వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. సంఘ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రముఖ నాటక కళాకారులు, సీనియర్ సభ్యులు ఘంటసాల మధన్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని సంఘ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, ఉపాధ్యక్షులు అందరూ కలిసి ముఖ్య అతిథిని శాలువాలతో సత్కరించి జ్ఞాపకతో గౌరవించారు. సభకు అధ్యక్షత వహించిన అజంతా గ్రూప్ అధినేత, దక్షిణ ఇండియా వైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ కనిగెలుపుల శంకర రావు మాట్లాడుతూ సమాజ సంక్షేమం కోసం నిర్వహిస్తున్న నాలుగు సేవా పథకాలను గురించి వివరించారు . ఉచిత సామూహిక వివాహాలు, అన్నదానం, విద్యానిధి, చరమ సంస్కారం సేవలను సభకు వివరించారు. సంఘ అభివృద్ధికి తమ విలువైన కాలాన్ని వెచ్చించి సేవలందించిన మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు ,కార్యనిర్వాహక సభ్యుల సేవలను గుర్తు చేస్తూ వాళ్లకి నివాళులర్పించారు . సంఘానికి పూర్వవైభవాన్ని తీసుకొని వచ్చే విధంగా కృషి చేయాలని సభ్యులందరికీ పిలుపునిచ్చారు.అలాగే సంఘం సంయుక్త కార్యదర్శి మద్ది నరసింహులు స్వాగతం పలుకుతూ 1905 సంవత్సరం మే1 తేదీన ఆవిర్భవించిన సంఘం సభ్యుల కాలక్షేపం కోసం ఏడు శాఖలు పనిచేస్తున్నాయని బిలియర్స్, లైబ్రరీ, లిటరరీ, గేమ్స్ ,డ్రామా తదితర శాఖలు పనిచేస్తున్నాయని వివరించారు. ఎందరో మహనీయుల సేవలు ఫలితంగా 120 సంవత్సరాలుగా నగరంలోని ప్రముఖ సంఘాలలో ప్రముఖ సంఘం గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందన్నారు.అనంతరం ముఖ్య అతిథి మధన్ కుమార్ మాట్లాడుతూ సంఘంతో ముఖ్యంగా నాటక శాఖతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాటక కళకు గత వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
సంఘం చేపడుతున్న విస్తృత సేవా కార్యక్రమాలు కొనియాడదగినవని ప్రశంసించారు.గౌరవ సభ్యులు నేత మునిరత్నం మాట్లాడుతూ ముఖ్య అతిథిగా పాల్గొన్న మదన్ కుమార్ సేవలను ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు . సంఘ కోశాధికారి పెసల రమేష్ వందన సమర్పణ చేయగా, మరో సంయుక్త కార్యదర్శి పువ్వాడ అశోక్ కుమార్ ఏర్పాట్లును పర్యవేక్షించారు.సంఘ ఉపాధ్యక్షులు M. ఉదయ్ కుమార్, G P V సుబ్బారావు, ఎం కాశీ విశ్వనాథం తో పాటు K K త్రినాధ్ కుమార్,పేర్ల బద్రి నారాయణ,ఇంకా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వినాయక స్తుతి తో ప్రారంభమైన ఈ కార్యక్రమం జాతీయలాపనతో
వైభవంగా ముగిసింది .

About Author