చెన్నై న్యూస్ మద్రాసు నగర ప్రప్రథమ మేయర్ , దేవాంగ కుల శిరోమణి సర్ పిట్టి త్యాగరాయ శ్రేష్టి 173వ జయంతి వేడుకలను శనివారం నగరంలో ఘనంగా జరుపుకున్నారు. దేవాంగ కుల సంఘాలతో పాటు పలు స్వఛ్చంద సంఘాలు , ప్రభుత్వ అధికారులు, మహిళలు , చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్ పిట్టి త్యాగరాయ శ్రేష్టి కి పుష్పాంజలి ఘటించారు.చెన్నై పాత చాకలి పేటలోని సర్ త్యాగరాయ కళాపరిషత్ ఆధ్వర్యంలో పాతచాకలిపేట లోని మన్నప్ప ముదిలి వీదిలో ఉన్న సర్ త్యాగరాయ ఉన్నత పాఠశాల నుంచి ఊరేగింపుగా బయలుదేరి టిహెచ్ రోడ్డులోని త్యాగరాయ పార్క్ లోఉన్న సర్ పిట్టి త్యాగరాయ విగ్రహానికి త్యాగరాయశ్రేష్టి వంశస్తులు, కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ పి నందివర్మన్ , ప్రదాన కార్యదర్శి జక్కుల హరికృష్ణ, ఉపాధ్యక్షులు ఎంఆర్ సుబ్రమణ్యం , కార్యదర్శి దేవి మాదవయ్య , కోశాధికారి ఎం. వెంకటేశ్వర్లు ,సభ్యులుదొడ్డి బాలరాజు పన్నెం యుగంధర్, ఎర్రా ఈశ్వరయ్య, ప్రముఖ వాణిజ్య వ్యాపార వేత్త కట్నా శ్రీనివాసులు , లవిశెట్టి బాలాజీ, మహిళలు ఉమ్మిటి గజలక్ష్మి జక్కుల శోభారాణి, లవిశెట్టి లావణ్య బాలాజీ , పన్నెం నాగలక్ష్మి ,గొట్టుముక్కల సీతమ్మ , చిన్నారులు పూజశ్రీ , నేహా లవిశెట్టి లు పాల్గొని పుష్పాంజలి ఘటించారు.అనంతరం త్యాగరాయ కళాశాల ప్రాంగణంలో ఉన్న సీనియర్ , జూనియర్ పిట్టి త్యాగరాయ శ్రేష్ఠి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు తమిళనాడు రాష్ట్రానికి , సమాజానికి పిట్టి త్యాగరాయ శ్రేష్ఠి చేసిన సేవలను
కొనియాడుతూ ప్రసంగించారు .ప్రతీ ఒక్కరికి ఆయన స్పూర్తిప్రదాన అని వ్యాఖ్యానించారు. అలాగే చెన్నపురి దేవాంగ సంఘం తరపున కోనంకి జనార్థన్ ,కార్యవర్గ సభ్యులు ,అలాగే త్యాగరాయ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం తరపున త్యాగరాయ శ్రేష్టికి నివాళి అర్పించారు. అలాగే చెన్నై సెంట్రల్ సమీపంలోని రిప్పన్ బిల్డింగ్‌లో ఉన్న త్యాగరాయ శ్రేష్టి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ అధికారులు ఘన నివాళుల అర్పించారు. అలాగే రామలింగం చెట్టియార్ ట్రస్ట్ తరపున నిర్వహకులు బాలాజీ రామలింగం, కె సత్యమూర్తి, ఏ. శశి , ఈ నాగేష్‌లు పాల్గొని త్యాగరాయశ్రేష్టికి నివాళి అర్పించారు.
More Stories
டாஸ்மாக் கடையில் பாட்டிலுக்கு 10 ரூபாய்க்கு மேல் வசூல் செய்தால் பணிபுரியும் அனைவரும் தற்காலிக பணியிடை நீக்கம்
Every Mix Tells a story: Le Royal Méridien Chennai’s Fruit Mixing Ceremony
CATALYST PR Wins Bronze at PRCI Awards!