చెన్నై న్యూస్ : వేద గురువు, ఆధ్యాత్మిక ఉపదేశకులు, పద్మభూషణ్ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి మంగళాశాసనాలతో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ( జెట్ ) – చెన్నై ఆధ్వర్యంలో అంతర్ పాఠశాలల వార్షిక భజన పోటీలు-2023 లను జులై 9 వ తేదీ ఆదివారం ఉదయం నుంచి మద్యాహ్నం వరకు నిర్వహించారు. చెన్నై టి. నగర్ లోని జీఎన్ శెట్టి రోడ్డులో ఉన్న వాణీ మహాల్ వేదికగా నిలిచింది.జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్- చెన్నై అధ్యక్షులు పి. రవీంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ భజన పోటీలకు
చెన్నై నగరంలోని వివిధ పాఠశాలల నుంచి 23 బృందాలు దాదాపు 400 మంది చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రాముడు, నారాయణ, నరసింహా, కృష్ణుడు మొదలగు దేవుళ్లపై పలు భజన పాటలను సీనియర్,జూనియర్ విభాగాలు గా ఏర్పడి ఎంతో శ్రావ్యంగా ఆలపించి అందరినీ అలరించారు.పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సంగీతకారులు జోస్యుల శైలేష్, సువర్ణలు వ్యవహరించారు.ఈ పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ ,టీటీడి స్థానిక సలహామండలి సభ్యులు డాక్టర్ రవీంద్ర సన్నా రెడ్డి ప్రారంభించి,చివరిగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు .
ఈ సందర్భంగా చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నారులు ఎంతో చక్కగా భజన పాటలు అలపించారని , ఒక్కో పాట వింటుంటే మనస్సుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉందని చిన్నారులను అభినందించారు.పిల్లల్లో చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక భావాలను పెంపొందించే
లక్ష్యం తో జెట్ -చెన్నై వారు వార్షిక భజన పోటీలు నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని నిర్వహకుల సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రసంశించారు. ముందుగా జెట్ -చెన్నై అధ్యక్షులు పి. రవీంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఈ భజన పోటీలను శ్రీ శ్రీ చిన జీయర్ స్వామి మంగళాశాసనాలతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ పోటీలను విజయవంతం చేస్తున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు, పోటీలకు సహకరిస్తున్న దాతలకు పేరు పేరునా ప్రత్యేక దన్యవాదుల తెలియజేశారు.సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని పిఎస్ బిబి స్కూల్ -కేకే నగర్, జి ఆర్ టి మహాలక్ష్మీ విద్యాలయ -అశోక్ నగర్ బృందాలు నిలువగా, జూనియర్ కేటగిరిలో పద్మాశేషాద్రి బాల భవన్ విద్యార్థుల బృందం విజేతలుగా నిలిచి .ఈ కార్యక్రమంలో జెట్ -చెన్నై సెక్రటరీ విశ్వంభర, కోశాధికారి శాంతి సుబ్బారావు, కో ఆర్డినేటర్ పి.కమల, కమిటీ సభ్యులు పివిఆర్ కృష్ణారావు, మీరాశేఖర్,అన్నపూర్ణ, ప్రేమాధాత్రి,ఉమ్మిడి బాలాజీ, గజలక్ష్మి, పద్మశ్రీ, పద్మలత, శారద, రవిచంద్రన్, చలపతి, జయలక్ష్మి, గోరెంట్ల బాలాజీ, ఉమ్మిడి లలితమ్మ, సునంధ తదితరులు పాల్గొన్నారు.
….
More Stories
காங்கிரஸ் மாமன்ற உறுப்பினர் சுகன்யா செல்வம் தலைமையில் சமத்துவ பொங்கல் விழா
వైభవంగా ఆర్యవైశ్య అన్నదాన సభ 15వ వార్షికోత్సవ వేడుకలు
తెలుగు వెలుగు తరపున సంక్రాంతి కానుకలు అందజేసిన అల్లింగం రాజశేఖర్