December 17, 2024

తెలుగు తరుణి ఆధ్వర్యంలో రిటైర్డ్ తెలుగు శాఖాధ్యక్షురాలు ఆంబ్రూణి కి ఘనసత్కారం.

కొరుక్కుపేట: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు తరుణి ఆధ్వర్యంలో తెలుగు భాషకు ఎనలేని సేవలను అందించిన డాక్టర్ అత్తోట అంబ్రూణి కి ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అక్టోబర్ 13వ తేదీ శుక్రవారం చెన్నై టి .నగర్ లోని డబ్ల్యూటిఎఫ్ ప్రధాన కార్యాలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు తరుణి అధ్యక్షురాలు కాశీసోమయాజుల రమణి అధ్యక్షత వహించారు. ప్రార్థన గీతంతో ప్రారంభమైన ఈ సభలో రమణి స్వాగతోపన్యాసం చేస్తూ తెలుగు భాషను అభివృద్ధి చేయాలని ,భాషను పరిరక్షించాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న ఆశయాలతో మాజేటి జయశ్రీ తెలుగు తరుణి స్టాపించారని తెలిపారు
.వారు కరోనా సమయంలో దురదృష్టవశాత్తు మరణించినట్టు తెలిపారు .ఆమె ఆశయాలతో తెలుగు తరుణి సంస్థను ముందుకు తీసుకుని వెళుతున్నట్టు తెలిపారు. వివిధ పండుగలు , ముఖ్యమైన రోజుల్లో వివిధ సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పురస్కారాలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు.రాష్ట్రంలో కనుమరుగ వుతున్న తెలుగు భాషను కాపాడుకునేందుకు తెలుగు కుటుంబాలన్ని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.తమ సంస్థ తరఫున తెలుగు భాషకు న్యాయం చేకూర్చేలా అన్ని కార్యక్రమాలను తెలుగులోనే జరుపుకుంటు న్నామని తెలిపారు సఖ్యత, సభ్యత,స్వచ్ఛత ద్యేయాలతో ముందుకెళ్ళుతూ సాటి మహిళలకు విజ్ఞానం ,వినోదం ,వికాసం పంచిపెడుతూ ఆనందింపజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు పదాలతో నిర్వహించిన తాంబోలా లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.విజేతలకు బహుమతులు అందజేశారు.రాజధాని కళాశాల రిటైర్డ్ తెలుగు శాఖాధిపతి డాక్టర్ అత్తోట ఆంబ్రూణి తన స్పందన తెలుపుతూ మహిళా సాధికారత కోసం ,తెలుగు భాషా వికాసానికి మహిళలచే స్థాపించిన తెలుగు తరుణి కృషి చేయటం చాలా గర్వంగా ఉందన్నారు.మహిళలు తలుచుకుంటే ఏ రంగంలోనే రాణించగలరని అన్నారు. ఎన్నో కష్టాలను అధిగమించి ఈ రోజు ఉన్నత స్థాయిలో నిలబడగాలిగానని గుర్తుచేశారు. తన ఎదుగుదలలో తల్లిదండ్రులు, స్నేహితులు , మరెందరో శ్రేయోభిలాషులు ఉన్నారని చెప్పారు. కష్టాన్ని నమ్ముకుని ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తే విజయం తప్పక వరిస్తోందని పేర్కొంటూ మహిళల్లో స్ఫూర్తి నింపారు.మాతృభాషపై మమకారాన్ని పెంచుకోవాలని ఆంధ్రులు ఎక్కడ ఉన్నా తెలుగు భాష లోనే మాట్లాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలుగు తరుణి కార్యదర్శి దేవసేన ,కోశాధికారి మాజేటి అపర్ణ లు ఏర్పాట్లు పర్యవేక్షించారు.పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.

About Author