December 24, 2024

తెలుగు వారికి అండగా ఉంటా- సంక్రాంతి వేడుకల్లో దేవరకొండ రాజు వ్యాఖ్య

చెన్నై న్యూస్: రంగవల్లులు, ఫ్యాషన్ పెరేడ్ ,మ్యూజికల్ చైర్ , వంటల పోటీలు, నృత్య ప్రదర్శనలు, సంక్రాంతి పాటలు, డప్పు వాయిద్యాలతో తమిళనాడు తెలుగు పీషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సరం, సంక్రాంతి సంబరాలు సందడిగా సాగాయి. చెన్నైలోని సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ ఆడిటోరియం వేదికగా తమిళనాడు తెలుగు పీపుల్ షన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవరకొండ రాజు సారథ్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటల వరకు వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా సంక్రాంతికి విడుదల రానున్న సోదర చిత్ర హీరోలు సంపూర్ణేష్ బాబు, సంజోష్ , ముఖ్య అతిధులుగా వీరపాండ్య కట్టబొమ్మన్ వంశీయులు డాక్టర్ ఇలయా కట్టబొమ్మన్, సినీ నటుడు కూల్ సురేష్ ,
శ్రీ గంగా ట్రాన్స్ పోర్ట్స్ అదినేత లయన్ వీజీ జయకుమార్, ఆధ్యాత్మిక ప్రవచనకర్త వీరం భట్లయ్య స్వామి, శివాజీ రాజా, ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షుడు కేఎం నాయుడు, సలహాదారు ఎంఎస్ మూర్తి ,సినీ నిర్మాత కిరణ్ కుమార్, రిటైర్డ్ జడ్జి రామస్వామి తదితర ప్రముఖులను దేవరకొండ రాజు సభకు పరిచయం చేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా దేవరకొండ రాజు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ తరపున విస్తృతంగా సేవా కార్యక్రమాలతో పాటు తెలుగు పండుగలు, వాటి విశిష్టతను తెలిపేలా వేడుకలను నిర్వహిస్తూవస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు లో స్థిరపడిన తెలుగు ప్రజలకు , విద్యార్థులకు తమ ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. సినీ నటులు సంపూర్ణేష్ బాబు, సంజోష్, కూల్ సురేష్ లు మాట్లాడుతూ తెలుగు ప్రజలతో కలిసి చెన్నై నగరంలో సంక్రాంతి పండుగ ను సంతోషంగా జరుపుకొనే అవకాశాన్ని , అదృష్టాన్ని కల్పించిన దేవరకొండ రాజు గారికి అభినందనలు తెలిపారు.అనంతరం రాజు, సూర్యకుమారి దంపతులను గజమాలతో ఘనంగా అతిధులు సత్కరించారు.. కార్యక్రమంలో బాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు, నర్తణీమణులకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమానికి ఆలిండియా రేడియో రిటైర్డ్ ఉద్యోగి బిట్రా గజగౌరి వ్యాఖ్యాత వ్యవహరించగా, పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ,తెలుగు ప్రముఖులు,సినీ నటులు సంక్రాంతి పండుగ సంబరాల్లో సందడి చేశారు.

About Author