- వి.కృష్ణారావు వ్యాఖ్య
చెన్నై విఆర్ న్యూస్: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి 151 వ జయంతి ఉత్సవాలు ద్రావిడ దేశం తరపున బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా చెన్నై, ప్యారీస్ లోని రాజా అన్నామలై మండ్రం సమీపంలో ఉన్న ఆంధ్రకేసరి శిలా విగ్రహానికి ద్రావిడ దేశం అధ్యక్షుడు వి. కృష్ణారావు పుష్పమాలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ తెల్లదొరలకు ఎదురొడ్డి నిలిచి ధైర్యం ఉంటే నా రొమ్ముపై కాల్చండి అని సవాలు విసిరిన ధైర్యశాలి ప్రకాశం పంతులు అని కొనియాడారు. తాను సంపాదించిందంతా ప్రజాసేవ కొరకై వినియోగించి చివరి రోజుల్లో ఎన్నో కష్టాలు అనుభవించిన త్యాగశీలి అని అన్నారు. “అమర్ రహే అమర్ రహే ఆంధ్ర కేసరి అమర్ రహే”, ” వీరవందనం వీర వందనం ఆంధ్రకేసరికి వీర వందనం” అనే స్లోగాలతో టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఘనంగా నివాళులర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో తెలుగు నాయకులు, వ్యాపారస్తులైన బక్కమంతుల వెంకట్రావు యాదవ్, ఎం.వెంగయ్య నాయుడు, మబ్బు పెంచలయ్య, పేర్ల బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
…
More Stories
సూర్యకాంతం నటన అనితరసాథ్యం- నటి పద్మిని వ్యాఖ్య
உலக தியான தினம் குறித்த முக்கிய உரை நாளை இந்திய நேரப்படி இரவு எட்டு மணி அளவில் நிகழ்த்த உள்ளது
NATIONAL OPEN ROTARY PARA TABLE TENNIS TOURNAMENT – SEASON3