December 17, 2024

పుళల్ కావంగరైలో భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టుకు పూజలు

చెన్నై న్యూస్: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చెన్నై సమీపంలోని పుళల్ కవంగరై లోని తిరు నీలకంఠ నగర్ లోని తెలుగు మహిళలు సాంప్రదాయబద్ధంగా ఉసిరి చెట్టుకు పసుపు , కుంకుమ పూసి నైవేద్యాలు సమర్పించి బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. కర్పూర హారతులు పట్టి అందరినీ చల్లగా దీవించాలని ప్రార్ధించారు. అలాగే తెలుగు సంఘ ముఖ్యనాయకులు జి మురళి ,బి కిష్టయ్య , పి నరసింహ రావు, ఎం చిట్టిబాబు, ఓబుల్ రెడ్డి, బి మురళి , ఇంకా తెలుగు ప్రజలు , పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను వినియోగం చేశారు.

About Author