చెన్నై: రాజధాని నగరం చెన్నై లో నివసిస్తున్న తెలంగాణా ప్రజలు సంప్రదాయబద్ధంగా చేపట్టిన సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం తో వైభవంగా ముగిశాయి. జార్జిటౌన్లోని శ్రీకన్యకా పరమేశ్వరీ కళావాల ప్రాంగణంలో చెన్నై తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో నగరం, శివారు ప్రాంతాల్లో నివసించే కుటుంబీకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదిక ప్రాంగణంలో వివిధ రకాల పూలతో రూపొందించిన బతుకమ్మను ఏర్పాటు చేసి మహిళలు నృత్యా లతో సందడి చేశారు. చెన్నై తెలంగాణా సంఘం నిర్వాహకులు బతుకమ్మ పండుగ సంబరాలను పర్యవేక్షించి అందరికీ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తోపాటు ,,తమిళనాడు తెలుగు పీపుల్స్ సొసైటీ అధ్యక్షులు దేవరకొండరాజు సహా జి సి సి జోన్ చైర్మన్ పి శ్రీరాములు, డి ఎం కె ప్రముఖులు హరి కుమార్ ,ఎస్ మురళి లనునిర్వాహ కులు ఘనంగా సన్మానించారు. చెన్నై తెలంగాణా సంఘం నిర్వాహకులు, కార్యవర్గ కమిటీ సభ్యులు, అన్ని కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. చెన్నై తెలంగాణా సంఘం గౌరవ అధ్యక్షుడు డి. అంజయ్య, అధ్యక్షుడు ముప్పిడి పరుశురాం, ప్రధాన కార్యదర్శి చిత్తలూరి శ్రీనివాస్, కోశాధికారి ఎస్ కె షఫీ,ఉపాధ్యక్షుడు సి హెచ్ నరసింహ,
ఉప కార్యదర్శి ఎన్ అశోక్, ఉప కోశాధికారి సి. అంజయ్య, కమిటీ లీడర్లు సి హెచ్ గిరి, సి హెచ్ రాం మూర్తి , ఎం .శ్రీనివాస్, కమిటీ కార్యవర్గ కమిటీ సభ్యులు, తెలంగాణ కుల సంఘాల నాయకులు పద్మశాలి సంఘం అధ్యక్షుడు డి బి శ్రీనివాస్ , గౌడ సంఘం అధ్యక్షుడు నోముల సోమయ్య, యాదవ సంఘం అధ్యక్షుడు రామసాని రాజు, గంగపుత్ర సంఘం అధ్యక్షులు డి.బాలాజీ , శాలివాహన సంఘం అధ్యక్షుడు జిబిల్లికపల్లి సురేష్, ముస్లీం సంఘం అధ్యక్షుడు ఎస్ కె ఎస్, ముదిరాజు సంఘం ప్రధాన కార్యదర్శి పోట్కారి భాస్కర్ , దళిత సంఘం అధ్యక్షుడు బొల్లె రామ చంద్రు, రజిక సంఘం అధ్యక్షుడు సట్టు యాదగిరి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
More Stories
காங்கிரஸ் மாமன்ற உறுப்பினர் சுகன்யா செல்வம் தலைமையில் சமத்துவ பொங்கல் விழா
వైభవంగా ఆర్యవైశ్య అన్నదాన సభ 15వ వార్షికోత్సవ వేడుకలు
తెలుగు వెలుగు తరపున సంక్రాంతి కానుకలు అందజేసిన అల్లింగం రాజశేఖర్