November 15, 2024

భక్తిశ్రద్ధలతో పుళల్ శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు

చెన్నై న్యూస్: చెన్నై సమీపంలోని పుళల్ ప్రాంతం లో కైలాసగిరిగా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం శ్రీ స్వర్ణాంబిక అమ్మవారు సమేత తిరుమూల నాథ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 26 తేదీ ఆదివారం ప్రత్యేక పూజలను అభిషేకాలను అన్నదాన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 10 గంటలకు దైవ దంపతులకు పాలు, పెరుగు, వెన్న ,గంధం, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలను నేత్రపర్వంగా నిర్వహించారు. దక్షిణాయనం, శరదృతువు, శుక్లపక్షం, చతుర్దశి, భరణి నక్షత్రం శుభ ముహూర్తంలో శ్రీ స్వర్ణాంబికా సమేత తిరుమూల నాథ స్వామి లను విశేషంగా పూలతో అలంకరించి పూజలను శాస్త్రోక్తంగా చేశారు. గోవుకు మహిళలు పసుపు కుంకుమ అద్ది భక్తితో గోమాతను వేడుకున్నారు.ఈ పూజల్లో పులల్ కావాంగరై తెలుగు ప్రజలు అధికంగా పాల్గొని దైవ దంపతుల కృపకు పాత్రులయ్యారు. శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పులల్ కావంగరైకి చెందిన తెలుగు కుటుంబాలు సమక్షంలో ప్రముఖ వ్యాపార వేత్త లయన్ జి. మురళి-మీనా దంపతుల సారథ్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో సుమారు మూడు వేల మందికి పైగా భక్తులు,ఆలయ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
..

About Author