September 20, 2024

మరణంపైన విజయమే యేసు పునరుత్థానం -రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేంద్రప్రసాద్

చెన్నైనగరంలోని వెపేరిలో ఉన్న మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ సంఘం( ఎంసిటిబిసి)లో యేసు క్రీస్తు పునరుత్థాన వేడుకలు (ఈస్టర్ పండుగ)అత్యంత పవిత్రముగా క్రైస్తవులు ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేందర్ ప్రసాద్ సారథ్యంలో ఈస్టర్ ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు.అలాగే దైవ వర్తమానమును అందించారు.క్రీస్తు ప్రభువు ప్రేమ, అనురాగము మానవ జాతి పట్ల ఏ విధముగా ఉందో తెలియ చేశారు.యేసు ప్రభువు ముందే చెప్పినట్లు శిలువపై మరణించి మూడో రోజు తిరిగి లేచాడు.మరణంపై ఏసుక్రీస్తు గెలిచిన విజయోత్సవమే ఈస్టర్‌ అని తెలిపారు.ఇది ప్రపంచంలోనే ఒక చరిత్ర అని ఉపదేశించారు. దేవునికి ఎవరైతే దూరంగా జీవిస్తారో వారికి సైతాన్ లక్షణాలు వస్తాయి అని అందువల్ల దేవుని మాటకు లోబడి విధేయతతో జీవిస్తే యేసు ప్రభువు అనేక మేలులు చేస్తారని వ్యాఖ్యానించారు. దుర్మార్గపు శక్తుల మీద విజయం , పాపపు శక్తుల మీద విజయం , మానవులకు కలిగిన అన్యాయం, అక్రమం పైన విజయం, చివరికి మరణంపైన విజయమే యేసు పునరుత్థానం అని వివరించారు.ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వేడుకలను చక్కని ఏర్పాట్లతో విజయవంతంగా నిర్వహించిన సంఘ కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించారు. అలాగే సంఘ విశ్వాసులందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈస్టర్ ఆరాధనలో వందలాది మంది క్రైస్తవ సోదర సోదరీమణులు వచ్చేసి ఈస్టర్ పండుగ సంతోషంగా జరుపుకొని ఒకరు నొకరు కరచాలనం చేస్తూ ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు .ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు జి రామయ్య ప్రధాన కార్యదర్శి పోతల ప్రభుదాస్ కోశాధికారి అనమలగుర్తి బాబు లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంఘ కార్యవర్గం తరపున సంఘ విశ్వాసులందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ముందుగా ఈస్టర్ పర్వదినం సందర్భంగా స్త్రీల సమాజం సభ్యులు, సండే స్కూల్ చిన్నారులు, యూత్ క్వయర్ లు క్రైస్తవ భక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించి వీనుల విందు చేశారు.ఈ సందర్భంగా అందరికీ కేక్ లను పంచిపెట్టారు.

..

About Author