April 19, 2025

మానవత్వపు విలువలతో జీవించాలి- సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్

చెన్నై న్యూస్: చెన్నై వేపేరిలోని మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ సంఘం ప్రాంగణంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సంఘకాపరి డాక్టర్ ఎస్. రాజేంద్రప్రసాద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సంఘ
అధ్యక్షుడు జి.రామయ్య, కార్యదర్శి పోతల ప్రభుదాస్, కోశాధికారి అనమలగుర్తి బాబు, ఈసీ సభ్యులు, స్త్రీల సమాజం, యూత్, సండే స్కూల్ నిర్వాహకులు పాల్గొని జెండా వందనం చేసి స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు.75 సంవత్సరాల భారత రాజ్యాంగ చట్టం ప్రజలకు అందించబడిందని అన్నారు. ఆ చట్టాన్ని ఎలా అనుసరిస్తున్నామో , ఎలా అభివృద్ధి చెందుతున్నామో పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు.భారత దేశ ప్రజలు ఏక మనస్సుతో, సమభావంతో ,సహోదర భావంతో, ప్రేమతో, మానవత్వపు విలువతో జీవించాలని కోరారు. రాబోయే తరం మానవత్వపు విలువలతో జీవించేలా ఆలోచనలు చేయాలని హితవు పలికారు.ఈ సందర్భంగా అందరికీ స్వీట్లు పంచిపెట్టారు.
..

About Author