September 20, 2024

రంగనాథ స్వామి ఆలయంలో వైభవంగా ముగిసిన దశావతార ఉత్సవాలు

చెన్నై: వైకుంఠ ఏకాదశి సందర్భంగా చెన్నై షావుకారుపేట ముల్లా వీధిలో వెలసియున్న పురాతన రంగనాథ స్వామి ఆలయంలో 12 రోజుల పాటు సాగిన దశావతార ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. తమిళనాడు రాష్ట్ర హిందూ దేవదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు చేతుల మీదుగా ఈ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. రంగనాథ స్వామి ఆలయ
ధర్మకర్తల మండలి చైర్మన్ జాలమడుగు హరికుమార్ నేతృత్వంలో సాగిన ఈ ఉత్సవాల్లో ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, రంగనాథస్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు.ప్రతీ రోజు నగరంలోని వివిధ నాట్య పాఠశాలల విద్యార్థినిలు నృత్య ప్రదర్శనలు, భక్తిగీతాలాపణలు సందడిగా సాగాయి. ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజు ముత్తైదువులు పాల్గొని సామూహిక కుంకుమార్చన పూజలను భక్తిశ్రద్ధలతో చేశారు.పూజల్లో పాల్గొన్న ముత్తైదువులకు తాంబూలం అందించారు.ఈ సందర్భంగా జాలమడుగు హరి కుమార్ మాట్లాడుతూ 12 రోజులు పాటు దశావతార ఉత్సవాలు విజయవంతంగా జరగటం పై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాలను ప్రారంభించిన మంత్రివర్యులు పి కె శేఖర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే
2024 కొత్త సంవత్సరంలో ప్రజలందరినీ రంగనాధ స్వామి చల్లగా కాపాడాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఆలయ సంయుక్త కమిషనర్ ములై, సహాయ కమిషనర్ నిత్య, సభ్యులు ఎ.జయకుమార్, ఇమ్మిడి కిషోర్, గాయత్రి, తిలకవతి, నిర్వాహక అధికారి ఆర్.జయరామన్ తదితరులు పాల్గొన్నారు.

About Author