December 24, 2024

రంజింపజేసిన గొల్లపూడి సాధన , భావనల నృత్య ప్రదర్శన

చెన్నై న్యూస్:చెన్నై , టీ.నగర్ తిరుమల పిళ్ళై వీధిలోని భారత్ కళాచార్- 2024 సంగీత ఉత్సవాల్లో తెలుగు కుటుంబానికి చెందిన సాధన- భావన గొల్లపూడి ల నృత్యం ఆద్యంతం ఆకట్టుకుంది.వీరి నృత్యానికి
గురువు డాక్టర్ రత్న కుమార్ (నట్టువాంగం), శ్రీకాంత గోపాలకృష్ణ (గాత్రం),ఎన్ కేశవన్ (మృదంగం), బి.ముత్తుకుమార్ (ఫ్లూట్) లు వాయిద్య సహకారం అందించారు.ఈ నృత్యోత్సవం ముందుగా వినాయక స్తుతి తో ప్రారంభమై నీనామ రూపములకు నిత్యమంగళం తదితర ఐదు కీర్తనలకు సాధన, భావన లు ప్రదర్శించిన అద్భుత భంగిమ, హావభావాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.అమెరికా దేశంలో స్థిరపడిన గొల్లపూడి భావనారాయణ – సరిత లక్ష్మీ దంపతుల కుమార్తెలైన వీరు ఇప్పటి వరకు చెన్నై మహానగరంలో మూడు నాట్యప్రదర్శనలు ఇచ్చి పలువురి ప్రశంశలు అందుకున్నారు. భారత్ క ళాచార్ నిర్వాహకులు, సీనియర్ నటుడు వై జి మహేంద్రన్, ప్రముఖ మృదంగం విద్వాన్ శ్రీనివాస్,, ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ(వామ్)గ్లోబల్ అధ్యక్షుడు రామకృష్ణ తంగుటూరి , సీనియర్ సిటిజన్ ఫోరమ్ చైర్మన్ వూరా బాబు రావు, సరస్వతి దంపతులు, వామ్ యూత్ వింగ్ నాయకులు కె కె త్రినాథ్ కుమార్ సహా పలువురు కళాకారులు , కళాభిమానులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నటుడు వైజి మహేంద్రన్ మాట్లాడుతూ సాధన,భావన గొల్లపూడి లు ఒకే సమయంలో ఒకే కీర్తనకు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శన మహా అద్భుతమని ఇది మార్గళి ఉత్సవాల్లో అరుదైన2 ముద్రగా నిలిచి పోతుందని ప్రసంగించారు.తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా లో స్థిరపడిన సాధన,భావన లు అటు విద్య, ఉద్యోగ రంగాల్లో , భారతీయ సంప్రదాయకళలలో ప్రావీణ్యం పొంది తమ అభినయం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారని కొనియాడారు.అనంతరం గురువు రత్నకుమార్ మాట్లాడుతూ తన వద్ద నృత్యంలో శిక్షణ పొందిన కళాకారుల్లో సాధన, భావనలు ఆదర్శంగా ఉన్నారని అభినందించారు.
..

About Author