చెన్నై న్యూస్ :జై వాసవీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్ధం అక్షయ సాయిబాబా ఆలయంలో మహా సుదర్శన హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
చెన్నై ఆచారప్పన్ వీధిలో వెలసియున్న అక్షయ సాయిబాబా ఆలయంలో మంగళవారం , బుధవారం రెండు రోజులు పాటు అష్టోత్తర శతకలశ మహాభిషేకం మహోత్సవం చేపట్టారు. జులై 2వ తేదీ మంగళవారం గణపతి పూజ, సంకల్పం, పుణ్యాహవచనం, కలశ స్థపణం, అగ్ని ప్రతిష్ఠ, లలితా అష్టోత్తర అర్చన, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు భక్తిశ్రద్దలతో నిర్వహించారు . జులై 3వ తేదీ బుధవారం లోక కల్యాణార్థం బుధవారం ఉదయం 7 గంటలకు పుణ్యాహవచనం సంకల్పం, కుంభ ఆరాధన, మహా సుదర్శన హోమ మహా పూర్ణాహుతి, మహా అభిషేకం, మహా హారతి వంటి పూజలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు . అనంతరం జై వాసవీ సాయి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర రావు –విజయలక్ష్మీ, ఫైనాన్సియల్ ట్రస్టీ డాక్టర్ ఎం.వీ. నారాయణ గుప్తా –జ్యోతి దంపతుల పర్యవేక్షణలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల లోపు 108 కలశాల మహా అబిషేక పూజలను లోక క్షేమం కోసం వైభవంగా నిర్వహించారు . మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సాయినాధునికి అభిషేకాలు చేసి తరించారు.
ఈ సందర్భంగా శ్వేత వర్ణ సాయినాథుని విగ్రహాన్ని , ఆలయ ప్రాంగణాన్ని పూలు ,అరటి మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులను కనువిందు చేశారు. భక్తులు పాల్గొని సాయి బాబా కీర్తిస్తూ భక్తి పాటలను అలపించి అక్షయ బాబా కృపకు
పాత్రులయ్యారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు.
…
..
లోక కళ్యాణార్ధం …అక్షయ సాయిబాబా ఆలయంలో వైభవంగా మహా సుదర్శన హోమం

More Stories
சட்ட மாமேதை டாக்டர் அம்பேத்கர் அவர்களின் 135வது பிறந்த நாளை முன்னிட்டு நாடு முழுவதும் மிகை எழுச்சியாக கொண்டாடப்பட்டது
தமிழ்நாடு வக்பு சொத்துக்களை காலக்கெடுவுக்குள் டிஜிட்டல் முறையில் அளவீடு செய்ய தமிழ் மாநில முஸ்லிம் லீக் வலியுறுத்தல்
Monica Singhal’s magical session “CURE IS SURE” in Chennai