December 24, 2024

వాసవీ క్లబ్ షావుకారుపేట చెన్నై ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

చెన్నై న్యూస్ :వాసవీ క్లబ్ షావుకారుపేట చెన్నై, వనిత షావుకారుపేట చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సెంట్రల్ స్టేషన్ సమీపంలోని పార్క్ టౌన్ లో ఉన్న చెన్నపురి అన్నదాన సమాజం అనాథ చిన్నారుల ఆశ్రమం లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వాసవీ క్లబ్ పావుకారు పేట క్లబ్ ల అధ్యక్షులు సి హెచ్ మల్లికార్జున రావు ,నాగలక్ష్మిల అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా డిపివో ముంజులూరు చంద్రకళ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.క్లబ్ ల సభ్యులందరూ జెండా వందనం చేశారు.ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ దేశంకోసం పాటుపడిన మహనీయులను స్మరించుకోవటంతోపాటు వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు సి సీహెచ్ మల్లికార్జున రావు మాట్లాడుతూ రెండు క్లబ్ ల తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు ప్రజలకు అందిస్తామన్నారు.గణతంత్ర వేడుకలను అనాథ చిన్నారులతో కలసి జరుపుకోవటం సంతృప్తి నిచ్చిందన్నారు.కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అల్పాహారం , విద్యా సామగ్రి , తిరుపతి లడ్డు ప్రసాదాలు, పండ్లు లను నిర్వాహకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో క్లబ్
కార్యదర్శులుగా డి.త్రిలోక్ బాబు , పూర్ణిమా , కోశాధికారులుగా కె ప్రవీణ్ కుమార్ ,శివ రంజని ,
ఆర్సీ ముంజులూరు మురళీమోహన్, జెడ్సీ ఎస్వీ పద్మనాభన్ తదితరులు పాల్గొన్నారు.
..

About Author