September 19, 2024

వీరపాండ్య కట్టబొమ్మన్న త్యాగాన్ని నిత్యం స్మరించుకుందాం…. డాక్టర్ సి ఎం కె రెడ్డి

చెన్నై న్యూస్ :బ్రిటీష్ పాలకుల సింహస్వప్నంగా నిలిచి ప్రాణత్యాగం చేసిన భారతదేశ స్వాతంత్ర పోరాట మొట్టమొదటి వీరుడు వీరపాండ్య కట్టబొమ్మన్నను నిత్యం స్మరించుకోవాలని అఖిల భారత తెలుగు సమాఖ్య, లింఫోట్ , తమిళనాడు మెడికల్ ప్రాక్టీష నర్స్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. వీరపాండ్య కట్టబొమ్మన్న 264వ జయంతిని పురస్కరించుకుని స్థానిక గిండీలోని గాంధీ మండపం ప్రాంగణంలో ఉన్న కట్టబొమ్మన్న విగ్రహానికి ఈ నెల 3 వ తేదీ బుధవారం ఏఐటిఎఫ్ తరఫున సీఎంకె రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ వారిని ధైర్యంగా ఎదిరించి పోరాడిన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అయిన వీరపాండ్యకట్ట బొమ్మన్న చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అయితే ఆయనకు తమిళనాడులో ఇంకా తగిన గుర్తింపు రాలేదని వ్యాఖ్యానించారు. తెలుగు వారి ముద్దుబిడ్డ కట్ట బొమ్మన్న సంతతి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని ,అలాగే అత్యధిక ఓటు బ్యాంకు కలిగి ఉన్నది తెలుగు వారేనని అయినా తెలుగు భాషకు తగిన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు తెలుగు వారందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వీరపాండ్య కట్ట బొమ్మన్ రాజ కమ్మల సముదాయ నల సంఘం -చెన్నై విభాగం నిర్వాహకులతో కలిసి కట్ట బొమ్మన్ జయంతి వేడుకలు జరుపుకోవడం తో పాటు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు.ఈ వేడుకల్లో ఏఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి నాయకర్ నందగోపాల్, ఉపాధ్యక్షుడు సి ఎం కిషోర్ , ఏఐటీఎఫ్ కు చెందిన సెల్వి, సెంథిల్ కుమార్, నిర్మల్ చందర్ , దామోదరన్ ,లయన్ జి.మురళి తదితరులు పాల్గొన్నారు.

About Author