చెన్నై న్యూస్:కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నైలోని అంబత్తూర్ లో నూతనంగా నిర్మించిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ మహాకుంబాభిషేక మహోత్సవం జులై 1వ తేదీ సోమవారం వైభవంగా జరిగింది. బెంగుళూరు వాసవీ పీరాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా గర్భాలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి మహాగణ పతి పూజతో మహా సంప్రోక్షణ క్రతువు ప్రారంభించారు. ట్రస్ట్ చైర్మెన్ అజంతా డా. కనిగెలుపుల శంకరరావు, విజయలక్ష్మి దంపతుల పర్యవేక్షణలో తెల్లవారుజామున 5 గంటలకు ఐదవ జాము యాగపూజ, గోపూజ, కంకణధారణ, కలశ పూజ ప్రాణ ప్రతిష్ఠ ,హోమాలు నిర్వహించారు. వాసవాంబ, గణపతి ఉపనిసత్తు పారాయణం, అష్టగణపతి మూలమంత్ర హోమం, మహా పూర్ణాహుతితో ఆలయ అర్చకులు ఈ నెల 28 నుంచి యాగశాల పూజలను ప్రారంభించి పూర్తి చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు మూలవర్లకు అభిషేకం, పరివార దేవతలు, ఆలయగోపుర కలశాలలకు మహా కుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన కన్యకా పరమేశ్వరి, శివపార్వతులు, విఘ్నేశ్వరుడు, వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, షిర్డీ సాయిబాబా విగ్రహాలకు సచ్చినానంద సరస్వతి స్వామి నేతృత్వంలో మహాకుంభాబిషేకం జరిగింది. ఈ సందర్భంగా అజంతా డాక్టర్ కే. శంకరరావు మాట్లాడుతూ.. కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి మాత ఆలయాలు లేని ప్రాంతాల్లో నూతన ఆలయాలు నిర్మించాలన్న సంకల్పంతో మొదటి సారిగా అంబ త్తూర్ ఆర్యవైశ్య సంఘానికి రూ.2 కోట్లతో ఆలయాన్ని నిర్మించి మహాకుంభాభిషేకాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అందుకు సహకరించిన పలువురు దాతలు, ఆలయ కమిటీ నిర్వహకులు, వైశ్యసంఘాల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. 2022 అక్టోబర్ లో ఈ ఆలయానికి శంకుస్థాపన చేసి, రెండేళ్ల వ్యవధి లోనే అమ్మవారి ఆలయాన్ని అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించగలిగామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెనుగొండకు చెందిన నూలి వెంకటరమణమూర్తి, జీఎమ్మార్ గ్రూప్ డైరెక్టర్ బొమ్మిడాల మణిసంతోష్, తారణ, అపోలో సుబ్రమణ్యం, పువ్వాడ శేషాద్రి, టి .ఎన్ కుమార్, C. రంగనాధం శెట్టి, ఇ.బాలాజి, బి.శ్రీధర్, N. ప్రవీణ్ కుమార్, డాక్టర్ D.రవిచంద్రన్, B.నరేంద్ర కుమార్,మధు ప్రియ ,ఎస్.కృష్ణ కుమార్, బి.ప్రభాకరన్అంబత్తూర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. తమిళ నాడు తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులందరికి ప్రసాదాలు పంపిణీ చేశారు
More Stories
Ramakrishna Math, Chennai, Wins ‘Spirit of Mylapore’ Award 2025 from Sundaram Finance
ஜாதி வாரி கணக்கெடுப்பு நடத்த மத்திய மாநில அரசை வலியுறுத்தி ஆர்ப்பாட்டம்
Birds of Paradise – an exhibition of theme-based art quilts