తిరుపతి న్యూస్: తిరుపతి శ్రీ కోదండ రామస్వామి తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత
శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. మంగళవారం
సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో 9 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
…
వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు

More Stories
சட்ட மாமேதை டாக்டர் அம்பேத்கர் அவர்களின் 135வது பிறந்த நாளை முன்னிட்டு நாடு முழுவதும் மிகை எழுச்சியாக கொண்டாடப்பட்டது
தமிழ்நாடு வக்பு சொத்துக்களை காலக்கெடுவுக்குள் டிஜிட்டல் முறையில் அளவீடு செய்ய தமிழ் மாநில முஸ்லிம் லீக் வலியுறுத்தல்
Monica Singhal’s magical session “CURE IS SURE” in Chennai