చెన్నై న్యూస్:ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా.. గోవిందా అంటూ భక్తులు ఆ గోవిందుడి నామాలను స్మరిస్తూ వెయ్యి మందికి పైగా శ్రీవారి భక్తులు చెన్నై నగరంలోని పెరంబూర్ నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు.
లోక క్షేమాన్ని కాంక్షిస్తూ పెరంబూరు కందపిళ్లై వీధిలోని శివ విష్ణు సేవార్థిగల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 43వ వార్షిక తిరుమల పాదయాత్ర భక్తి ప్రపత్తులతో ఆదివారం ప్రారంభమైంది. ఇందు కోసం జనవరి నుంచి తిరుమలకు వెళ్లేందుకు సిద్ధమైన భక్తులు 40 రోజులు పాటు తులసి మాల ధరించి దీక్ష చేపట్టారు. . ఈసందర్భంగా ఆలయంలో గురుస్వామి భక్తవత్సలం నేతృత్వంలో ఆదివారం ఉదయం 5 గంటలకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, అలాగే భజనలతో పాటు కర్పూర హారతి, పూజలను భక్తి శ్రద్దలతో చేశారు అనంతరం గురుస్వామి భక్తవత్సలం చేతుల మీదుగా శ్రీవారి భక్తులకు కిట్లను అందజేశారు .ఈ తిరుమల పాదయాత్రలో తమిళనాడు ,ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రలో పాల్గొనడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) స్థానిక సలహామండలి సభ్యులు బి.మోహనరావు, ఎం. అశోక్ కిషన్ ,
పారిశ్రామికవేత్త డి. జంబు, బి.రాజేంద్రన్ లు పాల్గొని తిరుమల పాదయాత్రను ఘనంగా ప్రారంభించారు. గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణలతో పాదయాత్ర ముందుకు సాగింది. టిటిడి నుంచి శ్రీవారి ప్రసాదాలను నిర్వహకులకు ఈసందర్భంగా అందజేశారు.చిత్తూరు వాసుదేవన్ 43వ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టిన గురుస్వామి భక్తవత్సలం, ట్రస్ట్ సభ్యులు పొన్నూరు వెంకట కృష్ణారావు , పాద యాత్ర నిర్వాహకులను అభినందించారు.తిరుమల పాదయాత్ర లోకకల్యాణం కోసం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ పాదయాత్రగా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. వివిధ ఆలయాలను దర్శించుకుంటూ ఈనెల 16న తిరుమలలోని శ్రీవారిని దర్శించుకోనున్నట్లు పాదయాత్రక సారధ్యం వహించిన గురుస్వామి భక్తవత్సలం. ట్రస్టు సభ్యులు డాక్టర్ పివి కృష్ణారావు తెలిపారు. అనంతరం బి.మోహన్ రావు మాట్లాడుతూ ప్రతీ ఏడాది తిరుమల పాదయాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే ఈ పాదయాత్ర ప్రారంభోత్సవ వేడుకలో తాను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.ఏడేళ్ల వయస్సు నుంచి 85 ఏళ్ల వయస్సు గల శ్రీవారి భక్తులు ఈ తిరుమల పాదయాత్రలో పాల్గొన్నారని గురుస్వామి భక్తవత్సలం తెలిపారు.
..
More Stories
Chennai Half Marathon 2024 receives over 6000 entries
அகத்தியர் லோப முத்ரா சிலைகள் பழமையான சிவன் ஆலயத்திற்கு நன்கொடை
ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా వైభవంగా గోపూజ