చెన్నై న్యూస్ :చెన్నై కొరట్టూర్ అగ్రహారంలోని రామాలయం వీధిలో ఉన్న శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో దసర పండుగను పురస్కరించుకుని శ్రీరామ భక్తుడు తులసీదాస్ కీర్తించిన హనుమాన్ చాలీసా గానామృత పారాయణం భక్తులను పరవశింప జేసింది.కొరట్టూర్ శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ఆదివారం ఉదయం 7:20 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేపంబట్టు లోని శ్రీ రామాంజనేయ నామ సంకీర్తన మండలి 298వ మహాయజ్ఞ హనుమాన్ చాలీసా భక్తి సంగీత కార్యక్రమం వైభవంగా సాగింది.శ్రీ రామాంజనేయ నామ సంకీర్తన మండలి కార్యదర్శి ఉదయ్ కుమార్ శర్మ నేతృత్వంలోని బృందం చే ప్రార్ధనతో ప్రారంభించి
శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లను స్మరిస్తూ 108 రాగలతో 108 అవర్తనాలతో మహామంగళి హారతులతో భజనలతో భక్తులను అలరించారు.ఈ సందర్భంగా శ్రీ ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షుడు జె ఎం నాయుడు మాట్లాడుతూ శరన్నవరాత్రుల శుభ సందర్భంగా కోదండ రామాలయంలో తమ సంస్థ తరపున లోక కల్యాణం కోసం చేపట్టిన ఈ హనుమాన్ చాలీసా భక్తి సంగీత పారాయణం చాలా విశిష్టంగా జరిగిందని తెలిపారు .దాదాపు 7 గంటలు పాటు నిర్విరామంగా సాగిన ఈ హనుమాన్ చాలీసా భక్తులను పరవశింప జేసిందని తెలిపారు .ఈ కార్యక్రమం చేపట్టిన శ్రీ రామాంజనేయ నామ సంకీర్తన మండలి బృందాన్ని పేరు పేరున అభినందించారు. అనంతరం శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఉపాధ్యక్షుడు కె ఎన్ సురేష్ బాబు మాట్లాడుతూ ఆధ్యాత్మిక , సేవా కార్యక్రమాలు నిర్వహించటం లో ఆంధ్ర కళా స్రవంతి ప్రత్యేక గుర్తింపు పొందింది అని తెలిపారు.భవిష్యత్ లోను తెలుగు భాషా వికాసానికి , విస్తృత ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వీరభద్ర రావు , రాజేంద్రన్ , దామోదరన్ , సరస్వతి, ఈ.కుమార్ , వి.భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
More Stories
காங்கிரஸ் மாமன்ற உறுப்பினர் சுகன்யா செல்வம் தலைமையில் சமத்துவ பொங்கல் விழா
వైభవంగా ఆర్యవైశ్య అన్నదాన సభ 15వ వార్షికోత్సవ వేడుకలు
తెలుగు వెలుగు తరపున సంక్రాంతి కానుకలు అందజేసిన అల్లింగం రాజశేఖర్