November 15, 2024

శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ హనుమాన్‌ జయంతి వేడుకలు

చెన్నై న్యూస్: శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో చెన్నై కొరట్టూరు అగ్రహారం రామాలయం వీధిలో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీ హనుమాన్‌ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి
జూన్ 1 వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు పాలు పెరుగు, తేనే , పన్నీరు ,నారికేల జలం ,సుగంధ ద్రవ్యాలతో అంజనేయ స్వామికి అభిషేకాలు నేత్రపర్వంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన మండపంలో హోమాలను, పూజలను శాస్త్రోక్తంగా చేపట్టారు. కోదండ రామాలయం ప్రాంగణంలో ఉన్న ఆంజనేయ స్వామివారికి తెలుగు ప్రముఖురాలు శోభ రాజా కానుకగా వెండితో తయారు చేయించిన కిరీటాన్ని బహుకరించారు .దీనిని ఆంధ్రకళా స్రవంతి కార్యవర్గ సభ్యులు సమక్షంలో ఆంజనేయ స్వామికి కిరీటాన్ని దరింప జేశారు.అలాగే. తమలపాకులు, వడమాలలతో ఆంజనేయ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరింపజేసి పూజలు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు 108 సార్లు శ్రావ్యమైన రాగలతో హనుమాన్‌ చాలీసా పారాయణం కొనసాగింది.హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ , శ్రావ్య రాగాస్‌ బృందం సభ్యులు హనుమంతుడి జీవిత చరిత్ర విశేషాలతో సంగీత కార్యక్రమం నిర్వహించి ఆధ్యంతం అలరించారు. భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్‌ దివ్యమైన నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. మరో వైపు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ, ఆంజనేయునికి హారతులు పడుతూ భక్తిభావాన్ని చాటుకున్నారు.ఈ వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నదానం, అన్నతీర్ధ ప్రసాదాలు, మామిడి పండ్లను పంపిణీ చేశారు.హనుమాన్‌ జయంతి వేడుకల ఏర్పాట్లు ను ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె. ఎం. నాయుడు, సలహాదారు ఎం ఎస్‌ .మూర్తి , కార్యదర్శి జె.శ్రీనివాస్, కోశాధికారి జి .వి .రమణ , ఇంకా వి ఎన్ హరినాధ్, బాలాజీ, కాశీ విశ్వనాధం, సరస్వతి, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

About Author