చెన్నై: తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, తెలుగు భాష , సాహిత్యం ,పండుగల విశిష్టతలను తెలియజేస్తూ ముందుకు సాగుతున్నశ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఈ నెల 10 తేదీ ఆదివారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు.చెన్నై ఆళ్వార్ పేట లోని మ్యూజిక్ అకాడమీ వేదికగా జరిగిన ఈ వేడుకకు శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన వహించారు.ఈ కృష్ణాష్టమి వేడుకలను స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ ఇమ్మని జ్యోతి ప్రజ్వలన చేసి వైభవంగా ప్రారంభించారు.
మాతృభాషను మరవద్దు: ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ భారత ఉపరాష్ట్రపతి నాయుడు సభను ఉద్దేశించి మాట్లాడారు.గత 25 ఏళ్లుగా శ్రీ కళా సుధ తరపున తెలుగు భాష సాహిత్యానికి ఎనలేని సేవ చేస్తున్న బేతిరెడ్డి శ్రీనివాస్ ను అభినందించారు.మాతృభాషను మరవద్దు అని వారి వారి మాతృభాషను మొదటి ప్రాధాన్యత నిస్తూ అన్ని భాషల్లో ప్రావీణ్యత సాదించాలన్నారు. భాష అనేది మాట్లాడటం కోసమే కాదని, మనమేంటో మన గతం ఏంటో,మన ఆచార వ్యవహారాలు ఏంటో, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడానికి దోహదపడే గొప్పసాధనం భాష అని వ్యాఖ్యానించారు. భావితరాలకు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.కళలను ఆస్వాదించటం, కళాకారులను గౌరవించుకోవటం మన భారతీయ సంస్కృతి అని అభిప్రాయపడ్డారు.వేమన శతకాలు, సుమతి శతకాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ముందుగా స్వాగతోపన్యాసాన్ని బేతిరెడ్డి శ్రీనివాస్ చేసి అతిధులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించారు.గౌరవ అతిధులుగా ప్రముఖ సినీ నేపధ్య గాయని పద్మభూషణ్ పి .సుశీల , పారిశ్రామిక వేత్త శోభారాణి, ,కార్తికేయ -2 సినిమా నిర్మాత టి జి విశ్వప్రసాద్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్ లు పాల్గొన్నారు.
అవధాన కార్యక్రమం:అవధాని డాక్టర్ వి బి సాయికృష్ణ యాచేంద్ర ఆధ్వర్యంలో సంగీత సాహిత్య గేయధార అద్వితీయ అపూర్వ ప్రయోగ అవధాన కార్యక్రమం జరిగింది.సంచాలకులుగా
శతావదాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ వ్యవహరించారు .పృచ్ఛకులుగా శతావదాని ఉప్పల ధడియం భరత్ శర్మ, ఆచార్య డాక్టర్ కాసల నాగభూషణం, ఎల్ బి శంకర రావు, సి.శోభారాజ ,సాలూరి వాసు రావు, జె కె రెడ్డి లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.ఈ సందర్భంగా నాట్య కళా సుధ పురష్కారాలను భరతనాట్యం కూచిపూడి కళాకారిణిలు విదూషి శైలజ ,విదూషి డాక్టర్ అర్చనలకు ప్రదానం చేశారు.అలాగే గురుశ్రీ పురస్కారాలను నరసారెడ్డి,సిఎంకె రెడ్డి, సాలూరి వాసు రావు,వీబీ సాయి కృష్ణ యాచేంద్ర, డాక్టర్ మహేష్ బాబు కొత్తపల్లి (యు ఎస్ ఏ),ఆర్ శేఖర్, అంబడిపూడి మురళి కృష్ణ లకు అందజేశారు. ముందుగా శైలజ, ఆర్ పి శ్రావణ్, పవిత్ర ల సంగీత సాంస్కృతి కార్యక్రమాలు ఆహుతిల్ని అలరించాయి.ఈ వేడుకలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు , తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.
More Stories
సూర్యకాంతం నటన అనితరసాథ్యం- నటి పద్మిని వ్యాఖ్య
உலக தியான தினம் குறித்த முக்கிய உரை நாளை இந்திய நேரப்படி இரவு எட்டு மணி அளவில் நிகழ்த்த உள்ளது
NATIONAL OPEN ROTARY PARA TABLE TENNIS TOURNAMENT – SEASON3