September 19, 2024

సదరన్ ఇండియా వైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పంపిణీ

చెన్నై న్యూస్:కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులకు సదరన్ ఇండియా వైశ్య అసోసియేషన్ (శివ) అధ్యక్షులు, అజంతా గ్రూప్ అధినేత అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర రావు పిలుపునిచ్చారు. సదరన్ ఇండియా వైశ్య అసోసియేషన్ నిర్వహణలో కొనసాగుతున్న వాసవీ విద్యానిధి పథకం కింద 100 మంది పేద విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ,విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
చెన్నై ప్యారీస్ లోని గిడ్డంగి వీధిలో ఉన్న సంఘ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకకు అజంతా శంకర రావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నదాత, కార్తిక్ టిఫిన్ సెంటర్ అధినేత డాక్టర్ రవిచంద్రన్ , గౌరవ అతిథిగా బి ఎస్ ఎన్ ఎల్ రిటైర్డ్ అధికారి ఉప్పు జయ చంద్రన్ , ఆత్మీయ అతిథిలుగా ఆర్య వైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు కె.రవి కుమార్ , ఎస్ కె పి డి ట్రస్టీ దేసు లక్ష్మి నారాయణలు పాల్గొని విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ముందుగా అజంతా శంకర రావు మాట్లాడుతూ వాసవీ విద్యానిధి పథకం కింద ప్రతీ ఏటా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలతో పాటు విద్యా సామగ్రిని ఉచితంగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.ముఖ్యంగా విద్యతోనే ఏదైనా సాధించవచ్చు అని కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని హితవుపలికారు. ఆడపిల్లలను బాగా చదివించాలని , బాలికలు చదువుకునేందుకు పలువురు దాతలు, తమ అసోసియేషన్ నిర్వాహకులు , సభ్యుల సహకారంతో చేయూత నిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సంయుక్త కార్యదర్శులు మద్ది నరసింహులు, పువ్వాడ అశోక్ కుమార్ , గౌరవ కోశాధికారి పెసల రమేష్ , విద్యా నిధి సెక్రటరీ మద్దాల ప్రవీణ్ కుమార్,
వైశ్య ప్రముఖులు మన్నారు ఉదయ్ కుమార్ , కె కె త్రినాధ్ కుమార్,ఇమ్మిడి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
…..

About Author