December 25, 2024

సదరన్ ఇండియా వైశ్య సంఘం ఆధ్వర్యంలో వైభవంగా సామూహిక వివాహాలు

చెన్నై న్యూస్:119 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సదరన్ ఇండియా వైశ్యసంఘం నిర్వహణలోని ఆర్యవైశ్య సామూహిక వివాహ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నాలుగు జంటలకు ఉచిత సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి.చెన్నై జార్జిటౌన్ ,ఆదియప్పనాయకన్ వీధిలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం మహామండపంలో నాలుగు జంటలకు వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు సురేష్ బృందం వివాహాలను శాస్త్రోక్తంగా జరిపించారు.అనంతరం ఎస్ కె పి కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన
సమావేశానికి సదరన్ ఇండియా వైశ్య సంఘం అధ్యక్షుడు, అజంతా గ్రూప్ అధినేత డాక్టర్ కనిగెలుపుల శంకరరావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్ ఏ సీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.అనంత పద్మనాభన్ , గౌరవ అతిథులుగా ఎస్ కె పి డి అండ్ చారిటీస్ ట్రస్టీ ఎస్ఎల్ సుదర్శనం ,నిప్పో బ్యాటరీస్ విశ్రాంత అధ్యక్షులు టి.వి. సుబ్బారావు, రాంకో ఇండస్ట్రీస్ విశ్రాంత సీనియర్ జనరల్ మేనేజర్ బి. సంపత్ కుమార్ ,కరూర్ వైశ్యాబ్యాంకు విశ్రాంత జనరల్ మేనేజర్ జీపీ అశోక్ కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సదరన్ ఇండియా వైశ్య సంఘం అధ్యక్షుడు అజంతా అధినేత డాక్టర్ కనిగెలుపుల శంకరరావు మాట్లాడుతూ 44 ఏళ్లుగా 408 జంటలకు సామూహిక పెళ్లిల్లు చేశామన్నారు.తమ సంఘం తరపున చేసే సేవాకార్యక్రమాలన్నీ దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్నామని తెలిపారు.శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో 44 సంవత్సరాలుగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన పేద కుటుంబాల్లోని యువతీ యువకులకు సంప్రదాయబద్దంగా ఉచితంగా వివాహాలు జరిపించటం సంతృప్తిని ఇస్తుందని అన్నారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎన్.అనంత పద్మనాభన్ మాట్లాడుతూ సదరన్ ఇండియా వైశ్యసంఘం చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు.దంపతులు మధ్య పరస్పర అవగాహన ఉంటే వారి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని హితవు పలికారు. అలాగే గౌరవ అతిధులుగా పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు పైగా సామూహిక వివాహాలు జరిపించటం మాములువిషయం కాదని, ఎంతో నిబద్ధతతో సేవాగుణంతో చేయటం పై ప్రసంశలు కురిపించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అజంతా డాక్టర్ శంకర రావు,
సంయుక్త కార్యదర్శిలు మద్ది నరసింహులు, పువ్వాడ అశోక్ కుమార్, కోశాధికారి పెసల రమేష్,
ఉపాధ్యక్షులు మద్దాలి కాశీవిశ్వనాదం, జిపివి సుబ్బారావు, మన్నారు ఉదయ్ కుమార్, తాతా నిరంజన్, సముద్రాల మురళి, కోటా గాయత్రి , వివాహ సంస్థ ఛైర్మన్ సి ఏ శేఖర్ , సెక్రెటరీ పార్థసారథి తదితరులు ఏర్పాట్లును పర్యవేక్షించి దాతలను, అతిధులకు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా నేతా మునిరత్నం, పేర్ల బద్రినారాయణ, డాక్టర్ టి.మోహన శ్రీ, ఓ.లీలా రాణిలు వ్యవహరించారు.ఉచిత వివాహానికి తరలివచ్చిన వధూవరుల బంధువులు, కుటుంబ సభ్యులు, వైశ్య ప్రముఖులు, ఎస్ కె పి డి అండ్ ఛారిటీస్ ట్రస్టీలు ఊటుకూరు శరత్ కుమార్, దేసు లక్ష్మీనారాయణ, సీ ఆర్ సురేష్ బాబు తదితరులు పాల్గొని నూతనవధూవరులను ఆశీర్వదించి వివిధ గృహోపకరణాలు బహుకరించారు.అలాగే సంఘం తరపున నూతన వధూవరులకు ఉచిత భోజన,బస, వసతి తో పాటు బంగారు మాంగల్యం,పట్టు వస్త్రాలు ,గృహానికి అవసరం అయిన సామాగ్రీని నిర్వాహకులు అందించారు
….

About Author